అన్వేషించండి

IBPS RRB: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు జూన్ 21తో ముగియాల్సి ఉండగా.. జూన్‌ 28 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌) రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. అయితే జూన్ 21తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. జూన్‌ 28 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,053 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబరు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు..

* ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XII, 2023

ఖాళీల సంఖ్య: 8612

1) ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌): 5538 పోస్టులు

ఏపీలో ఖాళీలు: 678.

2) ఆఫీస‌ర్ (స్కేల్‌-1): 2485 పోస్టులు

ఏపీలో ఖాళీలు: 261.

3) ఆఫీస‌ర్ (స్కేల్‌-2): 516 పోస్టులు

విభాగాలు: అగ్రికల్చర్ ఆఫీసర్-60, మార్కెటింగ్ ఆఫీసర్-03, ట్రైజరీ మేనేజర్-08, లా ఆఫీసర్-24, సీఏ-21, ఐటీ-68, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-332, 

3) ఆఫీస‌ర్ (స్కేల్‌-3): 73

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి (01.06.2023 నాటికి):

➥ ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1983 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1991 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1993 - 31.05.2005 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.  02.06.1995 - 01.06.2005 మధ్య జన్మించి ఉండాలి. 

➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు, వితంతు-ఒంటరి మహిళలకు జనరల్/ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-38, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తి్స్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.

పరీక్ష విధానం:

IBPS RRB: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.06.2023. (28.06.2023 వరకు పొడిగించారు)

➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 01.06.2023 - 21.06.2023.

➥ ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 17.07.2023 - 22.07.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్‌, 2023.

➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్‌/సింగిల్: సెప్టెంబర్‌, 2023.

➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌, 2023.

Click here to apply for the post of Officer Scale I

Click here to apply for the post of Officer Scale II/III

Click here to apply for the post of Office Assistant (Multipurpose)

నోటిఫికేషన్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget