IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8612 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 1నుంచి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబరులో మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు.
దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి 'ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-సీఆర్‌పీ XII' నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ మే 31న విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 8612 గ్రూప్-ఎ ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనుంది. తాజా నియామకాల్లో ఏపీలో 939 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 678 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, 261 ఆఫీసర్ స్కేల్-1 పోస్టులు ఉన్నాయి. అయితే తెలంగాణకు మాత్రం ఎలాంటి పోస్టులను మంజూరు చేయలేదు.
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబరు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
* ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XII, 2023
ఖాళీల సంఖ్య: 8612
1) ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్): 5538 పోస్టులు
ఏపీలో ఖాళీలు: 678.
2) ఆఫీసర్ (స్కేల్-1): 2485 పోస్టులు
ఏపీలో ఖాళీలు: 261.
3) ఆఫీసర్ (స్కేల్-2): 516 పోస్టులు
విభాగాలు: అగ్రికల్చర్ ఆఫీసర్-60, మార్కెటింగ్ ఆఫీసర్-03, ట్రైజరీ మేనేజర్-08, లా ఆఫీసర్-24, సీఏ-21, ఐటీ-68, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-332,
3) ఆఫీసర్ (స్కేల్-3): 73
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి (01.06.2023 నాటికి):
➥ ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1983 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి.
➥ ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1991 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి.
➥ ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1993 - 31.05.2005 మధ్య జన్మించి ఉండాలి.
➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.06.1995 - 01.06.2005 మధ్య జన్మించి ఉండాలి.
➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు, వితంతు-ఒంటరి మహిళలకు జనరల్/ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-38, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తి్స్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.
పరీక్ష విధానం:
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.06.2023.
➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 01.06.2023 - 21.06.2023.
➥ ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్(పీఈటీ) తేదీలు: 17.07.2023 - 22.07.2023.
➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్, 2023.
➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్/సింగిల్: సెప్టెంబర్, 2023.
➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్, 2023.
Click here to apply for the post of Officer Scale I
Click here to apply for the post of Officer Scale II/III
Click here to apply for the post of Office Assistant (Multipurpose)
Also Read:
ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐడీబీఐ బ్యాంకులో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 136 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మేనేజర్ పోస్టులకు రూ.48,170 - రూ.69810; అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.63,840- రూ.78,230; డిప్యూటీ జనరల్ మేనేజర్పోస్టులకు రూ.76,010- రూ.89,890గా ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..