అన్వేషించండి

IBPS PO Recruitment: 4455 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

IBPS PO Notification: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIV) విడుదల చేసింది.

IBPS PO Recruitment Notification 2024-25: దేశంలోని వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ (సీఆర్‌పీ-పీవో XIV) విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4455 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐబీపీఎస్ పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభంకాగా.. ఆగస్టు 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

పోస్టుల వివరాలు..

* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు: 4455 పోస్టులు

ఐబీపీఎస్ పరిధిలోని బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు

➥ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 885 పోస్టులు

➥ కెనరా బ్యాంక్: 750 పోస్టులు

➥ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000 పోస్టులు

➥ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 260 పోస్టులు

➥ పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200 పోస్టులు

➥ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 360 పోస్టులు

IBPS PO Recruitment: 4455 పోస్టులతో ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

అర్హత‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌యోపరిమితి: 01.08.2024 నాటికి 20 - 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. అభ్యర్థులు 02.08.1994 - 01.08.2004 మధ్య జన్మంచి ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 1984 అల్లర్ల బారినపడిన వారికి 5 సంవత్సరాల పాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి.

ఎంపిక‌ విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంట‌ర్వ్యూ ద్వారా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 నిమిషాలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 35 20 నిమిషాలు
రీజినింగ్ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం  100 100 60 నిమిషాలు

మెయిన్స్ పరీక్ష విధానం:

విభాగం  ప్రశ్నలు  మార్కులు   సమయం
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌  45 60 60 నిమిషాలు
జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌  40 40 35 నిమిషాలు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌   35 40 40 నిమిషాలు
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 60 45 నిమిషాలు
మొత్తం  155 200 3 గంటలు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ & ఎస్సే)
02 25 30 నిమిషాలు

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం: 01.08.2024

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.08.2024.

➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబరు, 2024.

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబరు, 2024.

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: అక్టోబరు, 2024.

➥ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: అక్టోబరు/న‌వంబ‌రు 2024.

➥ మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: న‌వంబ‌రు 2024.

➥ మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌రు 2024.

➥ మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2024/జనవరి 2025.

➥ ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2025.

➥ ఇంట‌ర్వ్యూ: జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2025.

➥ నియామకం: ఏప్రిల్ 2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్- మొదట కాంగ్రెస్ ప్రభుత్వ బాధితుల వద్దకే !?
Sajjala Bhargava Reddy: సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
సజ్జలకు బిగ్ షాక్, భార్గవ్ రెడ్డిపై పులివెందులలో నాన్ బెయిలబుల్ కేసు
Delhi Ganesh: తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
తమిళ చిత్ర పరిశ్రమకు షాక్ - ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత!
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Hyderabad News: జూబ్లీహిల్స్‌లోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు, శబ్ధానికి ఉలిక్కిపడ్డ స్థానికులు
Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Tiger Tension: రెండు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తున్న పులి, సాయంత్రం నుంచి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు సూచనలు
Jagan vs Lokesh: నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
నిక్కర్ మంత్రి నారా లోకేష్! కట్ డ్రాయర్ ఎమ్మెల్యే జగన్! టీడీపీ, వైసీపీ ట్వీట్స్ వార్
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
Embed widget