అన్వేషించండి

IBPS Clerk Exam: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ అడ్మిట్‌కార్డు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

IBPS Clerk Main Hall Tickets: ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.

IBPS Clerk Main Admit Card 2024: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 13న క్లర్క్స్ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షరోజు వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 

దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6128 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. ఏపీలో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రిలిమినరీ  పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 13న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఐబీపీఎస్ తాజాగా విడుదల చేసింది. 

IBPS క్లర్క్ అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -  ibps.in

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Online Main Exam Call Letter for CRP-Clerks-XIV' లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి. 

Step 4: వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.

Step 4: అడ్మిట్ కార్డు డౌన్‌‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది. 

IBPS మెయిన్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

మెయిన్ పరీక్ష (IBPS Clerks Main Exam Pattern): 
➥ మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
➥ మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి 190 ప్రశ్నలు అడుగుతారు.
➥ ఇందులో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు 35 నిమిషాల వ్యవధి; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు 160 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.
➥ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్.

ALSO READ: ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget