News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Group 1 Exam: 'గ్రూప్–1' పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, వారిపై చర్యలు తప్పవన్న హైదరాబాద్ కలెక్టర్!

తెలంగాణలో అక్టోబరు 16న నిర్వహించిన 'గ్రూప్–1' ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ డి. అమోయ్ కుమార్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు..

FOLLOW US: 
Share:

తెలంగాణలో అక్టోబరు 16న నిర్వహించిన 'గ్రూప్–1' ప్రిలిమ్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న ఆరోపణలను హైదరాబాద్ కలెక్టర్ డి. అమోయ్ కుమార్ కొట్టిపారేశారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు  ఆయన  ప్రకటన విడుదల చేశారు. నగరంలోని మూడు సెంటర్లలో ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల గ్రూప్–1పరీక్షను ఆలస్యంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

సికింద్రాబాద్ మారేడ్ పల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో మూడు గదుల్లో మొత్తం 47 మంది అభ్యర్థులకు ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌కు బదులుగా ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్‌ ఇచ్చారని తెలిపారు. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారని, అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌, కొత్త ఓఎంఆర్ షీట్లను ఇచ్చారని స్పష్టం చేశారు.

అయితే కొత్త ఓఎంఆర్ షీట్లలో రాస్తే తమ ప్రశ్నపత్రాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారని, అయితే కలెక్టర్‌తో పాటు కమిషన్ అధికారులు వాళ్లకు సర్ది చెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు వాళ్లు తిరిగి తమ పరీక్షను కొనసాగించారని తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వాళ్ల నుంచి ఓఎంఆర్ షీట్లను తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 


అబిడ్స్‌లోని మరో రెండు సెంటర్లలో కూడా...

అబిడ్స్‌లోని మరో రెండు సెంటర్లలో కూడా 'గ్రూప్–1' పరీక్షను అధికారులు ఆలస్యంగా నిర్వహించారు. అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలోనూ ఇంగ్లిష్/తెలుగు క్వశ్చన్ పేపర్‌‌కు బదులు ఇంగ్లిష్/నాన్ తెలుగు లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్‌ ఇవ్వడంతో పరీక్ష కొంత ఆలస్యం అయ్యింది. దీంతో  ఇద్దరికి 15 నిమిషాలు, ఐదుగురికి 30 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించినట్లు అధికారులు చెప్పారు. అలాగే అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 15 మందికి 7 నిమిషాల అదనపు సమయాన్ని పరీక్ష కోసం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు కోల్పోయిన సమయాన్ని వారికి కేటాయించామని, అంతే తప్ప 'గ్రూప్-1' పరీక్షలో ఎలాంటి తప్పులు జరగలేదని కలెక్టర్ తెలిపారు. ఆలస్యానికి కారణమైన ఇన్విజిలేటర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్  స్పష్టం చెప్పారు.


పరీక్షకు 75 శాతం హాజరు..

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 75శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు గాను.. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 2,86,051 అభ్యర్థులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోనే 100 వరకు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. ఎనిమిది రోజుల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రాథమిక కీ విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 


కటాఫ్ మార్కులు లేవు..

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కటాఫ్ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై టీఎస్‌పీఎస్సీ అధికారులు అక్టోబరు 17న స్పష్టత ఇచ్చారు. 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష కేవలం  స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఇందులో ఎలాంటి కనీస అర్హత మార్కులు ఉండవని ప్రకటించింది. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక విధానంలో మార్పులు జరిగాయని వివరించింది. గతంలో మార్కుల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం ఉండేదని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.


:: Also Read ::

TSLPRB SI, Constable Result: ఎస్ఐ, కానిస్టేబుళ్ల పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పోలీసు నియామక మండలి ఊరటనిచ్చే వార్త తెలిపింది. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోతే ఈ వారంలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్‌ కీతో పాటే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

RMLIMS: రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

RMLIMS: రామ్ మనోహర్ లోహియా మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 534 నాన్-టీచింగ్ పోస్టులు
లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 20 Oct 2022 06:44 PM (IST) Tags: Hyderabad Collector TSPSC Telangana News TSPSC Group1 Exam Allegations on Group1 Exam Group1 Exam Mall Practice Amoy Kumar

ఇవి కూడా చూడండి

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 151 సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు, వివరాలు ఇలా

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 86 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

AIIMS Bibinagar: బీబీనగర్‌ ఎయిమ్స్‌‌లో 40 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, వివరాలు ఇలా

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

SBI Clerks Recruitment: ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!