News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TET Exam: సెప్టెంబరు 14, 15 తేదీల్లో ఆ విద్యాసంస్థలకు సెలవులు - ఆ వార్తలపై యూనివర్సిటీ క్లారిటీ

టీఎస్ టెట్ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే టెట్ పరీక్ష జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం సెప్టెంబరు 14, 15 తేదీల్లో సెలవు ప్రకటించింది. 

FOLLOW US: 
Share:

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే టెట్ పరీక్ష జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం సెప్టెంబరు 14, 15 తేదీల్లో సెలవు ప్రకటించింది. 

రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2,052 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1కు 2,69,557 మంది దరఖాస్తు చేయగా.. 1139 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-2కు 2,08,498 రాయనుండగా.. ఈనెల 27న టెట్ ఫలితాలను ప్రకటించనున్నారు.

ఇదిలా ఉండగా.. జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలకు కూడా సెప్టెంబరు 14, 15 తేదీల్లో సెలవు ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా.. ఎలాంటి సెలవు ఇవ్వలేదని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. గురు, శుక్రవారాల్లో తరగతులు యథావిధిగా జరుగుతాయని వెల్లడించింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు.

టెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష షెడ్యూలు..

 

పేపర్-1 పరీక్ష విధానం: 
పేపర్-1లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్ నుంచి 30 పశ్నలు ఉంటాయి. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-5 ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).

పేపర్-2 పరీక్ష విధానం: 
పేపర్-2లో 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 4 సెక్షన్ల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. మూడు సెక్షన్ల నుంచి 30 పశ్నల చొప్పున 90 ప్రశ్నలు, ఒక సెక్షన్ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో సెక్షన్-1 ఛైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజి-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-2 లాంగ్వేజ్-1-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-3 లాంగ్వేజ్-2(ఇంగ్లిష్)-30 ప్రశ్నలు-30 మార్కులు, సెక్షన్-4 మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు).

అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40% గా నిర్ణయించారు.

తెలంగాణ టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
పాఠశాల విద్యాశాఖ ఇటీవలే 5089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 5,089 ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది. ఇక దివ్యాంగులకు మాత్రం 10 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది. 

డీఎస్సీ నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Published at : 14 Sep 2023 12:04 AM (IST) Tags: TSTET 2023 Notification TS TET 2023 Exam Pattern TS TET 2023 Exam Schedule TSTET 2023 Halltickets TS TET 2023 Exam TSTET Exam Date

ఇవి కూడా చూడండి

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

SSC JE Admit Card: ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ 'టైర్-1' హాల్‌టికెట్లు విడుదల, రీజియన్ల వారీగా అందుబాటులో

SSC JE Admit Card: ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ 'టైర్-1' హాల్‌టికెట్లు విడుదల, రీజియన్ల వారీగా అందుబాటులో

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టులు

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టులు

Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!

Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!

AIASL: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 323 ఉద్యోగాలు, వాక్‌ఇన్ తేదీలివే

AIASL: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 323 ఉద్యోగాలు, వాక్‌ఇన్ తేదీలివే

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...