HAL: హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్- హైదరాబాద్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
HAL Recruitment: హైదారాబాద్‌లోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
HAL Recruitment: హైదారాబాద్‌లోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 06 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 08 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 06
⏩ అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 03 పోస్టులు
అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ లేదా దానికి సమానమైన ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 08.05.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
⏩ అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్): 03 పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ లేదా దానికి సమానమైన మెకానికల్ విభాగంలో మెకానికల్/మెకానికల్ & ఇండస్ట్రియల్ ఇంజినీర్. / మెకానికల్ &ప్రొడక్షన్ ఇంజినీరీంగ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 08.05.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
వేతనం: నెలకు రూ.30,000- రూ.1,20,000.
చిరునామా:
THE MANAGER (HR)-RECRUITMENT
HINDUSTAN AERONAUTICS LIMITED,
AVIONICS DIVISION
BALANAGAR, HYDERABAD – 500 042.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08.05.2024.
ALSO READ:
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎపుడంటే
AAI Recruitment 2024: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్- 2024 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 01.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్)లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మే 01లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.