(Source: ECI/ABP News/ABP Majha)
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో మెడికల్ &హెల్త్ సర్వీసెస్ డాక్టర్ పోస్టులు!
సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీ డిప్లొమా/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు జూన్ 24, 28, జులై 7 తేదీల్లో ఇంటర్వ్యూాలు నిర్వహిస్తారు.
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కేడర్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీ డిప్లొమా/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 24, 28, జులై 7 తేదీల్లో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 10
* మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కేడర్ డాక్టర్లు.
విభాగాలు: జనరల్ సర్జన్, ఆర్థో సర్జన్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్, ఈఎన్‌టీ స్పెషలిస్ట్, ఆప్తామాలజిస్ట్, గైనకాలజిస్ట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీస్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీ డిప్లొమా/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 0-3 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32-40 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.1.4లక్షలు చెల్లిస్తారు.
చిరునామా:
1. Malanjkhand Copper Project (MCP), Balaghat (MP); Khetri Copper Complex (KCC), Rajasthan.
2. Indian Copper Complex (ICC), Jharkhand.
ఇంటర్వ్యూ తేదీలు: 24.06.2023(శనివారం), 28.06.2023(బుధవారం), 01.07.2023(శనివారం).
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.
Also Read:
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 24న గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 24 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 60 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 4 పోస్టులు, డీఈపీడీఎస్సీ & టీపీలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ పోస్టులు- అర్హతలివే!
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 121 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.