అన్వేషించండి

TSPSC: 'గ్రూప్-2' పరీక్షపై ఆగస్టు 14న నిర్ణయం, హైకోర్టుకు విన్నవించిన టీఎస్‌పీఎస్సీ

గ్రూప్‌-2 పరీక్ష వాయిదాపై ఆగస్టు 11న విచారణ జరిగింది. గ్రూప్‌-2 పరీక్ష నిర్వాహణపై ఆగష్టు 14న స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్‌ హైకోర్టుకు స్పష్టం చేసింది.

గ్రూప్‌-2 పరీక్ష వాయిదా కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం (ఆగస్టు 11) విచారణ జరిగింది. రాష్ట్రంలో ఇతర పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును కోరగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ తరుణంలో వాయిదా కష్టమని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్‌ తమ వాదనలు హైకోర్టు ముందు వినిపించింది. అయితే, గ్రూప్‌-2 పరీక్ష నిర్వాహణపై సోమవారం(ఆగష్టు 14) స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్‌ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. ఆగస్టు 14కి విచారణ వాయిదా వేసింది కోర్టు.

అభ్యర్థుల వాదనలు ఇలా..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు ఆగస్టు 10న హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్ పోస్టులతో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చర్ల పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాల్సిందిగా కోర్టును అభ్యర్ధించారు. అగస్టు 2 నుండి 30 వరకు రకరకాల పరీక్షలు జరగనున్నాయని, గ్రూప్-2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పరీక్షల సిలబస్ వేరు, దీంతో అన్ని పరీక్షలకు ఒకే నెలలోనే ప్రిపేర్‌ అయి రాయడం సాధ్యం కాదు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్-2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. 

టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ..
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ గురుకుల్ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. 1,535 సెంటర్‌లను ఎంపిక చేశాం. పరీక్షలు జరిగే స్కూల్,కాలేజ్ లకు సెలవులు ప్రకటించాం. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో.. పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు 14న స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో పిటిషన్‌పై విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది.

ALSO READ:

టీఎస్‌పీఎస్సీకి 'పరీక్ష' కాలం, గ్రూప్‌-2 వాయిదా వేయాలని కొందరు, వద్దంటూ మరికొందరు విజ్ఞప్తులు
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఒకే నెలలో ముఖ్యమైన పరీక్షలను నిర్వహిస్తుండటంతో.. తమకు అన్యాయం జరుగుతోందని, గ్రూప్-2 పరీక్ష వాయిదావేయాలని కొందరు అభ్యర్థులు కోరుతుండగా.. ఒకే పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మాత్రం పరీక్ష నిర్వహించాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో ఇరువర్గాలు విజ్ఞప్తులు చేస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే వీటిపై టీఎస్‌పీఎస్సీ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. గ్రూప్‌-2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున రెండురోజుల సమయం పడుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే గ్రూప్-2 పరీక్ష షెడ్యూలు ప్రకారమే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

హైకోర్టుకు 'గ్రూప్‌-2' అభ్యర్థులు, పరీక్ష వాయిదా కోరుతూ పిటిషన్లు
తెలంగాణలో 'గ్రూప్‌-2' పరీక్ష వాయిదా వేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆగస్టు 9, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్‌-2ను రీషెడ్యూల్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Embed widget