TSAT: టీశాట్‌లో 'గ్రూప్-2' తరగతులు, ప్రతిరోజూ 5 గంటలపాటు ప్రసారాలు
టీశాట్ ఛానెళ్లలో 'గ్రూప్-2' పరీక్షలకు ఆగస్టు 2 నుండి 5 గంటలపాటు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ప్రతిరోజూ రెండు గంటలు ప్రసారాలు అందిస్తోన్న ఛానళ్లు మరో 3 గంటలు అదనంగా ప్రసారాలను పెంచాయి.
తెలంగాణ 'గ్రూప్-2' పోటీ పరీక్షలకు ఆగస్టు 2 నుండి మరో మూడు గంటలపాటు అదనంగా పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ప్రతి రోజూ రెండు గంటలు ప్రసారాలు అందించిన టీశాట్ నెట్‌వర్క్ ఛానళ్లు మరో మూడు గంటల అదనంగా గ్రూప్-2 ప్రసారాలను పెంచాయి. ఆగస్టు 2న ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారాలు కొనసాగించనున్నారు.
అదేవిధంగా నిపుణ ఛానళ్లలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇంగ్లిష్, జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమం, చరిత్ర, ఎకానమీ సబ్జెక్టులపై ప్రసారాలు ఉండనున్నాయి. మరుసటి రోజు విద్య ఛానల్‌లో తెల్లవారు జామున 5 గంటల నుండి 10 గంటల వరకు పున:ప్రసారం చేయనున్నారు. తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది.
తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు.గ్రూప్-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రూప్-2 పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
పోస్టుల వివరాలు...
* గ్రూప్-2 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 783
1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు
విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.
3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు
విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.
5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు
విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.
6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.
7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు
విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు
విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.
9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు
విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.
10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు
విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.
11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు
విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.
12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు
విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.
13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు
విభాగం: లా డిపార్ట్‌మెంట్.
14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్.
15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు
విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్.
16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు
విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు
విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.
గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
'గ్రూప్-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌పీఎస్సీ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 8న కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..