కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం, 1488 మందికి 'సచివాలయ' ఉద్యోగాలు
ఏపీలో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జులై 26న ఉత్తర్వులు అధికారిక జారీచేసింది.
ఏపీలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జులై 26న ఉత్తర్వులు అధికారిక జారీచేసింది. అర్హులైన వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు మృతి చెందారు. వారి కుటుంబసభ్యుల్లో ఇప్పటి వరకు 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోగా... 1,488 మందికి ఉద్యోగాలిచ్చారు. మరో 1,149 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి ఆగస్టు 24 కల్లా నియామక ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
ALSO READ:
‘కారుణ్య’ ఉద్యోగులకు 'నైపుణ్య' పరీక్ష తప్పని సరి, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కారుణ్య' నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారి విషయంలో కీలక నిర్ణయిం తీసుకుంది. కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష (సీపీటీ)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జులై 25న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అయితే 2023 ఫిబ్రవరి 24 తర్వాత కారుణ్య నియామకాలు పొందిన వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కారుణ్య నియామకాల కింద టైపిస్టు, లోయర్ డివిజన్ టైపిస్టు, అప్పర్ డివిజన్ టైపిస్టు, టైపిస్టు-కం-అసిస్టెంట్ పోస్టులు పొందిన వారు ఇంగ్లిష్, తెలుగు టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఇప్పటివరకూ ఉండేది. తాజా ఉత్తర్వులతో పాత విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.
ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా సీపీటీలో ఉత్తీర్ణత సాధిస్తేనే సర్వీసును క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. ఈ మేరకు జులై 24న జారీచేసిన ఉత్తర్వుల్లో ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ నిబంధనలను సవరించింది. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పలు దఫాలు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు తాజా ఉత్తర్వులు వెలువడినట్లు సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కాకినాడ జీజీహెచ్‌లో థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు - అర్హతలివే!
కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జులై 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..