By: ABP Desam | Updated at : 09 Apr 2023 03:57 PM (IST)
Edited By: omeprakash
తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు
తెలంగాణలో కొత్తగా నాలుగు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో నైపుణ్య కేంద్రాలను నిర్మించాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్-న్యాక్) ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు పని చేస్తాయి. వీటిలో రెండు జిల్లా స్థాయివి కాగా మరో 2 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయివి.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నిరుద్యోగుల కోసం సిద్దిపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా కోసం సూర్యాపేటలో నైపుణ్య కేంద్రాలను నిర్మించనున్నారు. ఈ కేంద్రాలకు రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. నియోజకవర్గ స్థాయిలో బాల్కొండ పరిధిలోని మోర్తాడ్‌లో ఒకటి, సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో మరొక కేంద్రాన్ని నిర్మించనున్నారు. వీటికి రూ.5 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. 4 కేంద్రాల నిర్మాణానికి అయ్యే రూ.30 కోట్లను న్యాక్ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు.
తెలంగాణలో మరో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
తెలంగాణకు మరో మూడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. ఈ మేరకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో వంద చొప్పున ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లలో మొత్తం తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటిలో మూడు కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వాటి అనుమతి ప్రక్రియ వివిధ దశల్లో ఉందని.. వాటికి కూడా అనుమతి వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అనుమతి వచ్చిన మూడు వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని స్పష్టం చేశాయి.
ఇటీవల సీఎం కేసీఆర్ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాతి దశలో రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసి, బడ్జెట్‌లో నిధులనూ కేటాయించింది. తాజాగా ఆయా కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. ఇక కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 చొప్పున మొత్తం 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
Also Read:
TS EAMCET: 'టీ-శాట్' ద్వారా ఎంసెట్ పాఠాలు, శిక్షణ తరగతులు ప్రారంభం!
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న 'టీఎస్ ఎంసెట్' ప్రవేవ పరీక్షకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం 'టీశాట్' ద్వారా ఎంసెట్ కోచింగ్ ప్రారంభించింది. రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ తరగతులు ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఎంసెట్ రాయాలనుకుంటునన పేద విద్యార్థులకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకునే స్తోమత ఉండదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ క్యాలెండర్‌ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు జూన్ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!
C-DOT: సీడాట్‌లో 252 రిసెర్చ్/సీనియర్ రిసెర్చ్ ఇంజినీర్&మేనేజర్ పోస్టులు
TSPSC Group 1 Exam: జూన్ 4న 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
SAP: శాప్‌లో డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు- అర్హతలివే!
ICF: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి