By: ABP Desam | Updated at : 22 Jan 2023 08:16 PM (IST)
Edited By: omeprakash
ఏపీలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు
ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్ధికాభివృద్దితోపాటు యువతకు ఉపాధి కోసం పెద్ద ఎత్తున లఘు, చిన్న, మద్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్క్‌లను ఏర్పాటు చేయబోతోంది. నియోజకవర్గానికి ఒక పార్కు చొప్పున రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 పార్క్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోంది. ఇందులో భాగంగా మొదటి దశలో 75 పార్క్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లను అధ్యయనం చేసేందుకు త్వరలోనే పరిశ్రమల శాఖకు చెందిన నిపుణుల బృందం విదేశీ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఎలాంటి విధానాలు అమలుపరుస్తున్నారో పరిశీలించి, వాటిని రాష్ట్రంలో అమలుపరచేయాలని భావిస్తున్నారు. ఈ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధుల రాబట్టేందుకు క్లస్టర్ ఆధారిత పరిశ్రమల పార్క్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.
15 లక్షల మందికి ఉపాధి..
వాస్తవానికి పెద్ద సంస్థల్లోకన్నా చిన్న తరహా పరిశ్రమల్లోనే ఎక్కువ ఉపాధి కల్పన ఉంటుంది. 8 వేల కోట్లతో ఒక ఆటోమొబైల్ పరిశ్రమ పెడితే, పది వేల మందికి ఉపాధి లభిస్తుంది. అయితే అంతే మొత్తం పెట్టుబడి ఒక చిన్న తరహా పరిశ్రమల్లో పెడితే లక్ష మందికి ఉపాధి కల్పిస్తారని పరిశ్రమల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పార్క్‌ల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించనుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తయిందని, వీటిల్లోకి దాదాపు 25 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపింది. మార్చి నాటికి మరో 50 పార్క్‌లు పూర్తవుతాయని, వీటన్నింటి ద్వారా 15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పెద్ద పెద్ద పరిశ్రమలు అధికంగా మూతపడుతుండడం, లేదా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది, కోవిడ్ తర్వాత అభివృద్ది చెందిన దేశాలన్ని చిన్న తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాయి, ఈ నేపథ్యంలోనే సిఎం జగన్మోహన్‌రెడ్డి కూడా ఎంఎస్‌ఎంఈ పార్క్‌లపై దృష్టి పెట్టారు.
చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం..
చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 పార్క్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో పార్క్‌కు 100 నుండి 200 వందల ఎకరాల స్థలాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించి స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తికాగా.. మార్చి నాటికి మరో 50 కూడా అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 100 పార్క్‌లకు సంబంధించి మార్చిలోగా భూమిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఆ పార్క్‌ల్లో పరిశ్రమలు పెట్టే వారికి భూమి రేటు, విద్యుత్‌తోపాటు అనేక రకాల సబ్సిడీలు ఇస్తారు. అదే విధంగా ఒక్కో పార్క్ ఒక్కో రకమైన ఉత్పత్తులను మాత్రమే ఉత్పత్తి చేసేలా డిజైన్ చేయనున్నారు. దీనివల్ల క్టస్టర్ బేస్డ్ పార్క్‌లు ఏర్పడతాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను కూడా సులభంగా తీసుకురావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు 175 పార్క్‌లు సాకారమైతే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు ఫిబ్రవరి 3 వరకు అవకాశం, వెంటనే అప్లయ్ చేసుకోండి!
RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 8 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ