ECHS: ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌లో 139 మెడికల్, నాన్ మెడికల్ పోస్టులు
ECHS Recruitment: ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్‌ఎస్) కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్ & నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ECHS Recruitment: ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్‌ఎస్) కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్ & నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 139
* మెడికల్, పారా మెడికల్ & నాన్ మెడికల్ పోస్టులు
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ పాలిక్లినిక్: 06
అర్హత: గ్రాడ్యుయేట్. 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 63 సంవత్సరాలు.
జీతం: రూ.75000.
⏩ గైనకాలజిస్ట్: 03
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉండాలి. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 68 సంవత్సరాలు.
జీతం: ఫుల్ టైమ్(5 గంటలు) రూ.1,00,000; పార్ట్ టైమ్(4 గంటలు): రోజుకు రూ.3595; పార్ట్ టైమ్(3 గంటలు): రోజుకు రూ.2696; పార్ట్ టైమ్ (2 గంటలు): రోజుకు రూ.1797.
⏩ మెడికల్ స్పెషలిస్ట్: 03
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్ ఉండాలి. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 68 సంవత్సరాలు.
జీతం: ఫుల్ టైమ్(5 గంటలు) రూ.1,00,000; పార్ట్ టైమ్(4 గంటలు): రోజుకు రూ.3595; పార్ట్ టైమ్(3 గంటలు): రోజుకు రూ.2696; పార్ట్ టైమ్ (2 గంటలు): రోజుకు రూ.1797.
⏩ మెడికల్ ఆఫీసర్: 32
అర్హత: ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ తర్వాత కనీసం 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 66 సంవత్సరాలు.
జీతం: రూ.75000.
⏩ డెంటల్ ఆఫీసర్: 13
అర్హత: బీడీఎస్, ఇంటర్న్‌షిప్ తర్వాత కనీసం 03 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 63 సంవత్సరాలు.
జీతం: రూ.75000.
⏩ రేడియాలజిస్ట్: 01
అర్హత: మెడికల్ క్వాలిఫికేషన్.
వయోపరిమితి: 68 సంవత్సరాలు.
జీతం: ఫుల్ టైమ్(5 గంటలు) రూ.1,00,000; పార్ట్ టైమ్(4 గంటలు): రోజుకు రూ.3595; పార్ట్ టైమ్(3 గంటలు): రోజుకు రూ.2696; పార్ట్ టైమ్ (2 గంటలు): రోజుకు రూ.1797.
⏩ డెంటల్ హైజీనిస్ట్: 08
అర్హత: 12వ తరగతి/ సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.
వయోపరిమితి: 56 సంవత్సరాలు.
⏩ రేడియోగ్రాఫర్: 05
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.
వయోపరిమితి: 56 సంవత్సరాలు
జీతం: రూ.28,100.
⏩ ఫిజియోథెరపిస్ట్: 02
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా.
వయోపరిమితి: 56 సంవత్సరాలు
జీతం: రూ.28,100.
⏩ ఫార్మసిస్ట్: 13
అర్హత: 12వ తరగతి/బి ఫార్మ్.
వయోపరిమితి: 56 సంవత్సరాలు
జీతం: రూ.28,100.
⏩ నర్సింగ్ అసిస్టెంట్: 04
అర్హత: నర్సింగ్ అసిస్ట్ కోర్సు.
వయోపరిమితి: 56 సంవత్సరాలు
జీతం: రూ.28,100.
⏩ లేబొరేటరీ అసిస్టెంట్: 06
అర్హత: డీఎంఎల్‌టీ
వయోపరిమితి: 56 సంవత్సరాలు
జీతం: రూ.28,100.
⏩ లేబొరేటరీ టెక్నీషియన్: 10
అర్హత: 10వ తరగతి/ 12వ తరగతి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)
వయోపరిమితి: 56 సంవత్సరాలు
జీతం: రూ.28,100.
⏩ డ్రైవర్: 07
అర్హత: 8వ తరగతి.
వయోపరిమితి: 53 సంవత్సరాలు.
జీతం: రూ.19,700.
⏩ ఫిమేల్ అటెండెంట్: 10
అర్హత: అక్షరాస్యులు, సివిల్/ఆర్మీ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్‌లో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 53 సంవత్సరాలు.
జీతం: రూ.16,800.
⏩ సఫాయివాలా: 10
అర్హత: అక్షరాస్యులు, కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 53 సంవత్సరాలు.
జీతం: రూ.16,800.
⏩ చౌకీదార్: 10
అర్హత: 8వ తరగతి.
వయోపరిమితి: 53 సంవత్సరాలు.
జీతం: రూ.16,800.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2024
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 10.02.2024