DRDO: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు
గ్వాలియర్‌లోని డీఆర్‌డీవో- డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ)- జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్వాలియర్‌లోని డీఆర్‌డీవో- డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ)- జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ కెమిస్ట్రీతోపాటు నెట్/గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు నవంబరు 22న వాక్-ఇన్ నిర్వహించనున్నారు.
వివరాలు..
* జూనియర్ రిసెర్చ్ ఫెలో: 03 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ కెమిస్ట్రీ, వ్యాలిడ్ నెట్/ గేట్ స్కోరు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. పూరించిన దరఖాస్తులను స్కాన్ చేసి సంబంధిత ఈమెయిల్ చిరునామాలకు పంపాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
స్టైపెండ్: నెలకు రూ.37,000. హెచ్‌ఆర్‌ఏ అదనం.
ఇంటర్వ్యూ తేది: 22.11.2023.
ఇంటర్వ్యూ వేదిక:
Main Gate Reception,
Defence Research and Development Establishment (DRDE),
Jhansi Road, Gwalior-474 002.
ఈమెయిల్: director.drde@gov.in, anupam.deal@gov.in
ALSO READ:
విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్ సాయం పెంపు - ఎప్పటినుంచి వర్తిస్తుందంటే?
విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెంచింది. దీనివల్ల దేశంలోని దాదాపు 31 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చూకూరనుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. 2023, జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.
వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఆర్‌డీవో-కాన్పూర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్, వివరాలు ఇలా
కాన్పూర్‌లోని డీఆర్‌డీవో ఆధ్వర్యంలో డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎంఎస్‌ఆర్‌డీఈ), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, వ్యాలిడ్ నెట్/ గేట్ స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 3న జరిగే వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
విశాఖపట్నం-నేవల్ సైన్స్ & టెక్నలాజికల్ ల్యాబొరేటరీలో జేఆర్‌ఎఫ్ పోస్టులు
విశాఖపట్నంలోని డీఆర్‌డీవో-నేవల్ సైన్స్ & టెక్నలాజికల్ ల్యాబొరేటరీ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీతోపాటు నెట్/గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులకు నవంబరు 21, 23 తేదీల్లో వాక్-ఇన్ నిర్వహించనున్నారు.
ఫెలోషిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..
బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..