News
News
వీడియోలు ఆటలు
X

DRDO CEPTAM Results: డీఆర్‌డీవో సెప్టమ్-10 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చూసుకోండి!

డీఆర్‌డీవోలో 1061 పోస్టుల భర్తీకి మార్చి 20న నిర్వహించిన  డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ (డీఆర్‌డీవో) ఏప్రిల్ 25న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందబాటులో ఉంచింది.

FOLLOW US: 
Share:

డీఆర్‌డీవో సెప్టెమ్-10 ఎ&ఎ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. డీఆర్‌డీవోలో 1061 పోస్టుల భర్తీకి మార్చి 20న నిర్వహించిన  డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ (డీఆర్‌డీవో) ఏప్రిల్ 25న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.  

డీఆర్‌డీవో సెప్టమ్ 10 ఎ&ఎ - 2023 ఫలితాలు ఇలా చూసుకోండి..

Step 1: ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- drdo.gov.in

Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Results' ట్యాబ్ మీద క్లిక్ చేయాలలి. 

Step 3: DRDO CEPTAM 10 A&A 2023 రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేయాలి.

Step 4: అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.  

Step 5: అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

Step 6: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 7 నుంచి  డిసెంబరు 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు. సీబీటీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ & కేపబిలిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 1061 

1)  జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్(జేటీవో): 33 పోస్టులు

2) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1(ఇంగ్లిష్ టైపింగ్): 215 పోస్టులు

3) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్): 123 పోస్టులు

4) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(ఇంగ్లిష్ టైపింగ్): 250 పోస్టులు

5) అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(హిందీ టైపింగ్): 12 పోస్టులు

6) స్టోర్ అసిస్టెంట్(ఇంగ్లిష్ టైపింగ్): 134 పోస్టులు

7) స్టోర్ అసిస్టెంట్(హిందీ టైపింగ్): 04 పోస్టులు

8) సెక్యూరిటీ అసిస్టెంట్: 41 పోస్టులు

9) వెహికల్ ఆపరేటర్: 145 పోస్టులు

10) ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 18 పోస్టులు

11) ఫైర్‌మ్యాన్: 86 పోస్టులు

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 24న గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 24  పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 60 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 4 పోస్టులు, డీఈపీడీఎస్సీ & టీపీలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గోరఖ్‌పూర్‌ ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ పోస్టులు- అర్హతలివే!
గోరఖ్‌పూర్‌‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 121 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 25 Apr 2023 05:17 PM (IST) Tags: DRDO CEPTAM Result 2023 DRDO CEPTAM 10 Result 2023 DRDO CEPTAM 2023 DRDO CEPTAM 10 Admin and Allied Result 2023 DRDO CEPTAM 10 A&A Result 2023 DRDO CEPTAM 10 A&A Result DRDO CEPTAM 10 A&A 2023 Result

సంబంధిత కథనాలు

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

APPSC Group1 Mains: జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్,  జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు