DRDO Jobs: ఆయుధాల ఆవిష్కరణలో ఆసక్తి ఉందా - మీ కోసం డీఆర్డీఏ ఎదురు చూస్తోంది - ఇవిగో ఉద్యోగాలు
DRDO: డీఆర్‌డీవోలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం పలు అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.

Defence Jobs: మన సరిహద్దులను రక్షించే , ప్రపంచ ఆవిష్కరణలను రూపొందించే అత్యాధునిక పరిశోధనలు చేసే డీఆర్డీవోలో చేరాలనుకునేవారు లక్షల్లో ఉంటారు. అలాంటి వారి కోసం అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. రక్షణ శాఖలో కొత్త ఆవిష్కరణలు చేపట్టాలనుకునే వారి కోసం.. దేశ భవిష్యత్తును నిర్మించడం ద్వారా మీ భవిష్యత్తును నిర్మించుకోవాలని డీఆర్డీవో పిలుపునిస్తోంది.
*పూర్తి వివరాల కోసం https://www.drdo.gov.in లేదా https://rac.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించాలనిసూచించింది. అక్కడ ఉద్యోగ అవకాశాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానాల గురించి తెలుసుకోవచ్చు.
Join DRDO — where your innovation powers national strength.
— DRDO (@DRDO_India) June 20, 2025
Contribute to cutting-edge research that protects our borders and shapes global innovation.
Build your future by building the nation's future.#JoinDRDO #CareersInDefence #PrideInService
For more details visit:… pic.twitter.com/tWQlJ5BR7B
సైంటిస్ట్ పోస్టులకు B.Tech/B.E/M.Tech/M.Sc లేదా సంబంధిత రంగంలో Ph.D. వాలిడ్ GATE స్కోర్ తప్పనిసరి. టెక్నీషియన్ A పోస్టులకు 10వ తరగతి + ITI సర్టిఫికెట్ (ఉదా., ఫిట్టర్, ఎలక్ట్రీషియన్) ఉండాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B (STA-B) ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. M.Sc/B.Tech సంబంధిత రంగంలో, 28 సంవత్సరాల వయస్సు పరిమితి (రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది.
కొన్ని పోస్టులకు రాత పరీక్షలో టైర్-I (స్క్రీనింగ్), టైర్-II (ఫైనల్ సెలక్షన్) ఉంటాయి టెక్నీషియన్ పోస్టులకు ITI స్థాయిలో ప్రాక్టికల్ స్కిల్స్ పరీక్షిస్తారు. సైంటిస్ట్ B, JRF పోస్టులకు GATE స్కోర్ (80% వెయిటేజ్) మరియు ఇంటర్వ్యూ (20% వెయిటేజ్) ఆధారంగా ఎంపిక. ఉంటుంది.
సైంటిస్ట్ B (Advt. No. 156) అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ - 04 జులై 2025. JRF (VRDE) వాక్-ఇన్ ఇంటర్వ్యూ - 21-23 ఏప్రిల్ 2025 న ఉంటాయి. అప్రెంటిస్ (LRDE) దరఖాస్తు చివరి తేదీ - 25 మే 2025. అధికారిక వెబ్‌సైట్‌ల నుండి మాత్రమే సమాచారం తీసుకోండి, మరిన్ని సందేహాలు ఉంటే, *https://rac.gov.in లోని కాంటాక్ట్ సెక్షన్ ద్వారా సంప్రదింవచ్చు.





















