అన్వేషించండి

Delhi Police: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల - ఎప్పటినుంచంటే?

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ జనవరి 7న ఒక ప్రకటన విడుదల చేసింది.

Delhi Police Constable PET Schedule: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్ల (PET, PMT) షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ జనవరి 7న ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జనవరి 13 నుంచి 20వ తేదీ వరకు ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ)లను నిర్వహించనున్నారు. ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలోనే అందుబాటులో రానున్నాయి. 

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(Constable Executive Results) నియామక పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) డిసెంబరు 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 85,867 మంది అభ్యర్థులు తదుపరి నిర్వహించే ఫిజికల్ ఈవెంట్లు (PE, MT), ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. ఇందులో 55,989 మంది పురుషులు; 29,878 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పరీక్షలో అర్హత మార్కులను యూఆర్-35 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-30 మార్కులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు - 25 మార్కులుగా నిర్ణయించారు. 

Delhi Police: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూలు విడుదల - ఎప్పటినుంచంటే?

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు నవంబరు 14 నుంచి డిసెంబరు 3 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించినవారికి ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.21,700-రూ.69,100 (పే లెవల్-3) కింద జీతభత్యాలు చెల్లిస్తారు.

పోస్టుల వివరాలు..

1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302.

2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలలి. అభ్యర్థులు 02.07.1998 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు 5 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌(ఎస్సీ, ఎస్టీ)లకు 10 సంవత్సరాలు, ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు- 40 నుంచి 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఇతర అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.   

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌-50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ-15 ప్రశ్నలు-15 మార్కులు, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర అంశాల నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

జీతభత్యాలు: రూ.21,700 - రూ.69,100.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
Embed widget