IMMT Recruitment: భువనేశ్వర్ ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ ఉద్యోగాలు, అర్హతలివే!
సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
భువనేశ్వర్‌లోని సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(ఐఎంఎంటీ) వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ డిప్లొమా/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 24లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 25
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ ఫెలో, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ డిప్లొమా/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 35-50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.17000-రూ.56000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 24.11.2022.
::Also Read::
బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు, ప్రారంభం జీతం రూ.40 వేలు!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్ట్రాటజిక్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ రంగంలో దేశ నిర్మాణం కోసం పనిచేయాలనుకునే డైనమిక్ యువతకి భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీకి చెందిన వివిధ యూనిట్లలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ఎంపికైనవారిని హైదరాబాద్ గచ్చిబౌలి యూనిట్, కాంచన్ బాగ్ యూనిట్, హైదరాబాద్, భానూర్ యూనిట్, ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా, విశాఖపట్నం, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని ఉన్న యూనిట్లలో నియమిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
విజయనగరం జిల్లాలో సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, దరఖాస్తుచేసుకోండి!
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము ఎన్టీఈపీ ప్రొగ్రామ్‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు తమ ధరఖాస్తులను జిల్లా క్షయ నివారణా అధికారి కార్యాలయం, విజయనగరం వారికి నవంబరు 17 సా.4గం లోపు సమర్పించవలెను.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...