DMHO Jobs: విజయనగరం జిల్లాలో సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, దరఖాస్తుచేసుకోండి!
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము ఎన్టీఈపీ ప్రొగ్రామ్‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము ఎన్టీఈపీ ప్రొగ్రామ్‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు తమ ధరఖాస్తులను జిల్లా క్షయ నివారణా అధికారి కార్యాలయం, విజయనగరం వారికి నవంబరు 17 సా.4గం లోపు సమర్పించవలెను.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 07 పోస్టులు
1) సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ లేదా శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సు, సర్టిఫికేట్ కోర్సు(కంప్యూటర్ ఆపరేషన్), టూవిలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.33,975.
2) సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్: 02 పోస్టులు
అర్హత: గ్రాడ్యేయేషన్, డీఎంఎల్‌టీ, సర్టిఫికేట్ కోర్సు(కంప్యూటర్ ఆపరేషన్), టూవిలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.33,975.
3) ల్యాబ్ టెక్నీషియన్: 04 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్(10+2)& డిప్లొమా లేదా , సర్టిఫికెట్ కోర్సు(మెడికల్ లబోరేటరీ టెక్నీషియన్) ఉండాలి.
జీతం: నెలకు రూ.19,019.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా క్షయ నివారణా అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాలో అందజేయాలి.
Also Read:
ఏపీ, తెలంగాణ జీడీఎస్-2022 ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
భారత తపాలా శాఖ- గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) నియామకాలు-2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఏడో జాబితాను పోస్టల్ శాఖ నవంబర్ 10న విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఏపీ సర్కిల్‌లో 326 మంది అభ్యర్థులు, తెలంగాణ సర్కిల్‌లో 162 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యమిత్ర పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..