Group2 Application Edit: 'గ్రూప్-2' దరఖాస్తుల సవరణకు అవకాశం, తప్పులుంటే సరిదిద్దుకోండి
AP Group2 Application Edit: ఏపీలో 'గ్రూప్-2' పోస్టుల దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది.
![Group2 Application Edit: 'గ్రూప్-2' దరఖాస్తుల సవరణకు అవకాశం, తప్పులుంటే సరిదిద్దుకోండి Correction Application Submission for Group-II Services enabled edit details here Group2 Application Edit: 'గ్రూప్-2' దరఖాస్తుల సవరణకు అవకాశం, తప్పులుంటే సరిదిద్దుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/19/594b09d1e64574d7ca74aa2c0b18b9341705654224728522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
APPSC Group2 Application Correction: ఏపీలో 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు జనవరి 17తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక విండోను కమిషన్ జనవరి 18న అందుబాటులో ఉంచింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్‌ను పొందుపరిచింది. దరఖాస్తుల సవరణకు మూడురోజులపాటు అవకాశమిచ్చింది. అభ్యర్థులు జనవరి 20 వరకు వివరాలు మార్చుకోవచ్చు. వివరాలు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తప్పులు సరి చేసుకోవాలని తెలిపింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఒకేసారి అవకాశం..
⏩ దరఖాస్తుల సవరణకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అందుకే తమ వివరాలను సవరించుకోవాలనుకునే అభ్యర్థులు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
⏩ అభ్యర్థులు తమ బయోడేటా వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. తప్పుగా నమోదుచేసిన వివరాలను గుర్తించాలి.
⏩ వివరాలను సరిచేసుకున్నాక, దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
⏩ బయోడేటా వివరాలను మార్చుకునే అభ్యర్థులు పేరు, జెండర్, పుట్టినతేది వివరాలకు సంబంధించిన సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
గ్రూప్-2 దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జవనరి 17తో గడువు ముగియనుంది.
గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు..
* గ్రూప్-2 పోస్టులు
ఖాళీల సంఖ్య: 899
➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333
➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566
అర్హత: డిగ్రీ, ఆపై విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.80 నుంచి మినహాయింపు ఉంది.
గ్రూప్-2 పోస్టుల అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష విధానం:
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)