CIPET: సీపెట్ భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా
CIPET Bhopal Recruitment: భోపాల్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది.
![CIPET: సీపెట్ భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా CIPET Bhopal has released notification for the recruitment of Lecturer Posts CIPET: సీపెట్ భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/26/99e96b43178ad816e2e54f16508c2e621695737052260522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CIPET Bhopal Recruitment: భోపాల్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అన్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 07 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 05
➥ లెక్చరర్(మెకానికల్ ఇంజినీరింగ్): 01
➥ లెక్చరర్ (కెమిస్ట్రీ): 01
➥ లెక్చరర్(మ్యాథ్స్): 01
➥ లెక్చరర్(ప్లాస్టిక్స్/ పాలిమర్): 01
➥ లెక్చరర్(ఇంగ్లిష్): 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
జీత భత్యాలు: నెలకు ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌కు రూ.40,000, లెక్చరర్‌కు రూ.30,000 నుంచి రూ.35,000.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.10.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Principal Director & Head,
CIPET: CSTS, G-Sector,
Govindpura Industrial Area,
JK Road, Bhopal 462023.
ALSO READ:
ఎయిమ్స్-కళ్యాణిలో 120 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ ఆయుష్ విభాగంలో టీచింగ్ పోస్టులు, అర్హతలివే
సికింద్రాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డా. హైదరాబాద్ ఎర్రగడ్డలోని బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్‌లోని డాక్టర్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుర్వేదంలో పీజీ డిగ్రీతోపాటు టీచింగ్ అనుభవం కలిగనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)