TS Ayush: తెలంగాణ ఆయుష్ విభాగంలో టీచింగ్ పోస్టులు, అర్హతలివే
సికింద్రాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సికింద్రాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయం, ఆయుష్ శాఖ, ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డా. హైదరాబాద్ ఎర్రగడ్డలోని బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్‌లోని డాక్టర్ ఏఎల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుర్వేదంలో పీజీ డిగ్రీతోపాటు టీచింగ్ అనుభవం కలిగనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
1) ప్రొఫెసర్: 04 పోస్టులు
స్పెషాలిటీ: సంహిత, సంక్రిత్, సిద్ధాంత.
2) అసోసియేట్ ప్రొఫెసర్: 05 పోస్టులు
స్పెషాలిటీ: సంహిత, సంక్రిత్, సిద్ధాంత, రచనా శరీర్, క్రియా శరీర్, అగాద తంత్ర.
అర్హతలు: ఆయుర్వేదంలో పీజీ డిగ్రీతోపాటు టీచింగ్ అనుభవం కలిగా ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూ.
జీతం: ప్రొఫెసర్ పోస్టులకు రూ.60,000; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.50,000.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
O/o. The COMMISSIONER,
DEPARTMENT OF AYUSH,
8-1-14, SHIVAJI NAGAR,
MARKET STREET,
BEHIND REGIONAL PASSPORT OFFICE,
SECUNDERABAD -500003.
దరఖాస్తుకు చివరి తేది: 29.09.2023.
ALSO READ:
ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ అర్హతతో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఈ పోస్టులను ఐడీబీఐ భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..