NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జారీ చేసింది.
Central Universities Recruitment Exam: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్/ పర్మనెంట్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా సెంట్రల్ వర్సిటీల్లో నాన్ టీచింగ్ నియామకాలు చేపడతారు. పోస్టును అనుసరించి పదోతరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2023
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
యూనివర్సిటీ వారీగా ఖాళీలు..
➥ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) న్యూఢిల్లీ: 102
జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్- 50
పోస్టుల కేటాయింపు: జనరల్- 19, ఎస్సీ- 08, ఎస్టీ- 04, ఓబీసీ- 14, ఈడబ్ల్యూఎస్- 05. వీటిలో పీడబ్ల్యూబీడీ- 02, ఎక్స్- సర్వీస్‌మెన్- 05, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్- 03.
అర్హత: 10+2 లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ పరీక్ష: కంప్యూటర్‌లో ఆంగ్లం-40 w.p.m స్పీడ్, హిందీ- 35 w.p.m స్పీడ్ టైపింగ్ ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
పేమ్యాట్రిక్స్: 19900-63200 లెవెల్ 02 (7th CPC)
స్టెనోగ్రాఫర్- 52
పోస్టుల కేటాయింపు: జనరల్- 23, ఎస్సీ- 07, ఎస్టీ- 03, ఓబీసీ- 14, ఈడబ్ల్యూఎస్- 05. వీటిలో పీడబ్ల్యూబీడీ- 02, ఎక్స్- సర్వీస్‌మెన్- 05, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్- 02
అర్హత: 10+2 లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ పరీక్ష: కంప్యూటర్‌లో ఆంగ్లం-40 w.p.m స్పీడ్, హిందీ- 35 w.p.m స్పీడ్ టైపింగ్ ఉండాలి. షార్ట్‌హ్యాండ్ టెస్ట్ @ 80 w.p.m. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
పేమ్యాట్రిక్స్: రూ.25,500 - రూ.81,100 (లెవెల్ 04 (7th CPC))
దరఖాస్తు ఫీజు: జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫీమేల్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600.
➥ మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, మోతిహారి(బిహార్): 48
గ్రూప్-ఎ పోస్టులు
సిస్టం అనలిస్ట్: 01(జనరల్)
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్: 01(జనరల్)
హిందీ ఆఫీసర్: 01(జనరల్)
అసిస్టెంట్ రిజిస్ట్రార్: 02(జనరల్)
గ్రూపు బి పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 01(జనరల్)
ప్రైవేట్ సెక్రటరీ: 03*(జనరల్)
సెక్యూరిటీ ఆఫీసర్: 01(జనరల్)
హిందీ ట్రాన్స్‌లేటర్: 01(జనరల్)
జూనియర్ ఇంజినీర్(సివిల్): 01(జనరల్)
జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01(జనరల్)
పర్సనల్ అసిస్టెంట్: 01(జనరల్)
ప్రొఫెషనల్ అసిస్టెంట్: 01(జనరల్)
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్): 01(జనరల్)
గ్రూపు సి పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్: 01(జనరల్)
స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01(జనరల్)
అప్పర్ డివిజన్ క్లర్క్: 05(జనరల్- 4, ఓబీసీ- 1)
లేబొరేటరీ అసిస్టెంట్: 04(జనరల్- 3, ఓబీసీ- 1)
లైబ్రరీ అసిస్టెంట్: 01(జనరల్)
లోయర్ డివిజన్ క్లర్క్: 9*(జనరల్- 6*, ఓబీసీ- 2, ఎస్సీ- 1)
హిందీ టైపిస్ట్: 01(జనరల్)
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 02(జనరల్)
డ్రైవర్: 03(జనరల్)
లేబొరేటరీ అటెండెంట్: 04(జనరల్- 3, ఓబీసీ- 1)
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది(ఎంజీసీయూ/ఇగ్నో): 21.12.2023.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 22.12.2023 నుంచి 25.12.2023 వరకు.