CISF: 'టెన్త్' అర్హతతో కానిస్టేబుల్ పోస్టులు, 1124 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి
CISF Constable Vacancies: అభ్యర్థులు మార్చి 04 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫిజికల్ పరీక్షలు, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు

CISF Constable Recruitment: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1124 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్న పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభమవుతుంది. అభ్యర్థుల మార్చి 04 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనంగా ఇస్తారు. ఫిజికల్ పరీక్షలు, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 1124
పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)- 460 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 111 పోస్టులు, ఎస్సీ- 167 పోస్టులు, ఎస్టీ- 83 పోస్టులు, ఓబీసీ- 303 పోస్టులు.
⏩ కానిస్టేబుల్/ డ్రైవర్: 845 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)- 344 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 84 పోస్టులు, ఎస్సీ- 126 పోస్టులు, ఎస్టీ- 63 పోస్టులు, ఓబీసీ- 228 పోస్టులు.
⏩ కానిస్టేబుల్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్)- 279 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్(యూఆర్)- 116 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 27 పోస్టులు, ఎస్సీ- 41 పోస్టులు, ఎస్టీ- 20 పోస్టులు, ఓబీసీ- 75 పోస్టులు.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్/ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్/ లైట్ మోటార్ వెహికల్/ మోటార్ సైకిల్ విత్ గేర్) తప్పనిసరిగా ఉండాలి. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి.
వయోపరిమితి: 04.03.2025 నాటికి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
రాత పరీక్ష: 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్/హిందీ ప్రాథమిక పరిజ్ఞానం అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. సమయం: 120 నిమిషాలు.
జీత భత్యాలు: నెలకు రూ.21,700-రూ.69,100.
దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన రెండు దశలు:
✦ పార్ట్ I: వన్-టైమ్ రిజిస్ట్రేషన్
మొదటిసారి ఎలా నమోదు చేసుకోవాలి..
➥ CISF అధికారిక వెబ్‌సైట్ https://cisfrectt.cisf.gov.in/ లోకి లాగిన్ అవ్వాలి.
➥ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత “లాగిన్” బటన్ పై క్లిక్ చేయండి.
➥ న్యూ పేజీ ప్రదర్శించబడుతుంది. “NEW REGISTRATION” బటన్ పై క్లిక్ చేయండి.
➥ అభ్యర్థులు తమ వివరాలను అందించడం ద్వారా రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి.
వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కింది సమాచారాన్ని పూరించాలి..
బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటైల్స్, డిక్లరేషన్.
✦ పార్ట్ II: అప్లికేషన్ ఫారం.
➥ అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఆధారాలతో లాగిన్ అవ్వాలి.
➥ దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
➥ దరఖాస్తు ఫీజు చెల్లించాలి(జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ.100).
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.02.2025.
* ఆన్‌లైన్ దరఖాస్తుకుల చివరి తేదీ: 04.03.2025.
Notification





















