By: ABP Desam | Updated at : 29 Sep 2023 10:24 PM (IST)
Edited By: omeprakash
సీడ్యాక్ ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు
C-DAC Recruitment: తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్)లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్ఠోబర్ 12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్ఠోబర్ 18వ తేదీన ఉదయం 9 నుంచి 11 వరకు ఇంటర్వ్యూకి హాజరుకావోచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 08
* ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు.
విభాగాలు: కంప్యూటింగ్ అండ్ గ్రిడ్ & క్లౌడ్ కంప్యూటింగ్, హెరిటేజ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ & సైబర్ ఫోరెన్సిక్స్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, ఎంటెక్, పీజీ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.37500 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: CDAC, Vellayambalam, Thiruvananthapuram.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు చివరి తేది: 12.10.2023.
ఇంటర్వ్యూ తేదీ: 18.10.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి 11 వరకు.
ALSO READ:
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 51 స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు, వివరాలు ఇలా
గువాహటి మాలిగావ్‌లోని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వివిధ క్రీడాంశాల్లో స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజేతలైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌బీఐలో 2000 పీవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు గడువు సెప్టెంబరు 27తో ముగియాల్సి ఉండగా.. అక్టోబరు 3 వరకు పొడిగించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పీవో పోస్టుల దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు
TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>