News
News
వీడియోలు ఆటలు
X

BIS: న్యూఢిల్లీ బీఐఎస్‌లో 14 సైంటిస్ట్‌ పోస్టులు- వివరాలు ఇలా!

న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సైంటిస్ట్‌ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.

FOLLOW US: 
Share:

న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సైంటిస్ట్‌ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ(టెక్నాలజీ)/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్మతలు గల అభ్యర్థులు మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

వివరాలు..

మొత్తం ఖాళీలు: 14

* సైంటిస్ట్‌ బీ పోస్టులు.

విభాగాల వారీగా ఖాళీలు..

1. బయో-మెడికల్ ఇంజనీరింగ్: 02

2. కెమిస్ట్రీ: 02

3. కంప్యూటర్ ఇంజనీరింగ్: 04

4. ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్: 02

5. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్: 04

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ(టెక్నాలజీ)/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ అర్హత సాధించాలి.

వయోపరిమితి: 21-30 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు: నెలకు రూ.102501 చెల్లిస్తారు.

దరఖాస్తుకు చివరి తేది: 12.05.2023.

Notification 

Website 

Also Read:

జేఈఈ మెయిన్‌ తుది కీ విడుదల, హైదరాబాద్‌ విద్యార్థి కౌండిన్యకు 'ఫుల్' మార్కులు!
జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఏప్రిల్ 24న రాత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఏ ప్రకటించిన ఫైనల్ ఆన్సర్ కీ ప్రకారం హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్ కౌండిన్యకు 300/300 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్ ఫలితాల్లో మొదటి 10 ర్యాంకుల్లో కౌండిన్య నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 

డీఈఈసెట్-2023 నోటిఫికేషన్‌ విడుదల, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ!
తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్‌-2023' (డీఎడ్‌) నోటిఫికేషన్‌ ఏప్రిల్ 21న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 22 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. 
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.. 

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 24న గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 24  పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 60 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 4 పోస్టులు, డీఈపీడీఎస్సీ & టీపీలో 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 24న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు మే 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

గోరఖ్‌పూర్‌ ఎయిమ్స్‌లో 121 ఫ్యాకల్టీ పోస్టులు- అర్హతలివే!
గోరఖ్‌పూర్‌‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 121 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 25 Apr 2023 08:28 PM (IST) Tags: Bureau of Indian Standards BIS Notification BIS Recruitment Scientist-‘B’ Posts

సంబంధిత కథనాలు

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు -  అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

Canada : కెనడాలో లెక్కలేనన్ని ఉద్యోగాలు - అక్కడి ప్రభుత్వ ఎన్ని ఆఫర్లు ఇస్తుందో తెలుసా ?

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

TSPSC: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లు, అభ్యంతరాల గడువు ఇదే!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

Siemens: సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!