News
News
X

BSF Recruitment: బీఎస్‌ఎఫ్‌లో వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు, వివరాలు ఇలా!

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్‌) పలు వెటర్నరీ స్టాఫ్ గ్రూప్-సి(నాన్ గెజిటెడ్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. అభ్యర్థుల వయసు 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి..

FOLLOW US: 
Share:

భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్‌) పలు వెటర్నరీ స్టాఫ్ గ్రూప్-సి(నాన్ గెజిటెడ్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన నాటి నుంచి నెలరోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 26.

1. హెడ్ కానిస్టేబుల్(వెటర్నరీ): 18 పోస్టులు

2. కానిస్టేబుల్(కెన్నెల్‌మ్యాన్): 08 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: నెలకు హెడ్ కానిస్టేబుల్‌కి  రూ.25,500 - రూ.81,100; కానిస్టేబుల్‌కు రూ.21,700 - రూ.69,100.

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలో ఉద్యోగ ప్రక‌ట‌న వెలువ‌డిన నాటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.   

Website 

Also Read: 

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 1105 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 37 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌-2023 నోటిఫికేషన్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. దీనిద్వారా ఫారెస్ట్ సర్వీసెస్‌లోని వివిధ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?
బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 04 Feb 2023 06:49 PM (IST) Tags: BSF Recruitment border security force BSF Notification Veterinary Staff

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?