(Source: ECI/ABP News/ABP Majha)
BECIL - AIIMS Notification: ఎయిమ్స్‌లో 155 డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియోగ్రాఫర్ పోస్టులు - అర్హతలివే!
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎయిమ్స్ కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 155 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 12లోగా ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 155
➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 50 పోస్టులు
➥ పేషెంట్ కేర్ మేనేజర్: 10 పోస్టులు
➥ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్: 25 పోస్టులు
➥ రేడియోగ్రాఫర్: 50 పోస్టులు
➥ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్: 20 పోస్టులు
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: పేషెంట్ కేర్ మేనేజర్ పోస్టులకు ఉద్యోగంలో చేరే సమయానికి 40 సంవత్సరాలు మించకూడదు. పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ పోస్టులకు ఉద్యోగంలో చేరే సమయానికి 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.885 చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు అదనంగా ప్రతి పోస్టుకు రూ.590 చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు రూ.531 చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు అదనంగా ప్రతి పోస్టుకు రూ.354 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: 12.04.2023.
Also Read:
ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌ఐ, ఏఎస్‌ఐ తుది పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తుది పరీక్ష హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 6న అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు పూర్తిచేసుకున్న అభ్యర్థులు.. ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించే తుది పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 వరకు; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్టు ఇటీవల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..