BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్‌లో భారీగా ఖాళీల భర్తీ, ఈ వారమే లాస్ట్ డేట్
పదో తరగతి పాసై ఐటీఐ చేసినవాళ్లకు అవకాశం. బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఏకంగా 2500కుపైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి.
BSF Constable Tradesmen Recruitment 2022: 2788 ఉద్యోగాల భర్తీకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(Border Security Force) నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరిలోనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఈ వారంతో ముగియనుంది. దీనికి పురుషులు, స్త్రీలు ఇద్దరూ అర్హులే.
ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి
పోస్టు పేరు: కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్(CT)
పురుషుల ఖాళీలు: 2651 ఉద్యోగాలు
CT (Cobbler) – 88 ఉద్యోగాలు
CT (Tailor) – 47 ఉద్యోగాలు
CT (Cook) – 897 ఉద్యోగాలు
CT (Water Career) – 510 ఉద్యోగాలు
CT (Washer Man) – 338 ఉద్యోగాలు
CT (Barber) – 123 ఉద్యోగాలు
CT (Sweeper) – 617 ఉద్యోగాలు
CT (Carpenter) – 13 ఉద్యోగాలు
CT (Painter) – 03 ఉద్యోగాలు
CT (Electrician) – 04 ఉద్యోగాలు
CT (Draughtsman) – 01 ఉద్యోగాలు
CT (Waiter) – 06 ఉద్యోగాలు
CT (Mali) – 04 ఉద్యోగాలు
మహిళల ఖాళీల వివరాలు: 137 ఉద్యోగాలు
CT (Cobbler) – 03 ఉద్యోగాలు
CT (Tailor) – 02 ఉద్యోగాలు
CT (Cook) – 47 ఉద్యోగాలు
CT (Water Career) – 27 ఉద్యోగాలు
CT (Washer Man) – 18 ఉద్యోగాలు
CT (Barber) – 07 ఉద్యోగాలు
CT (Sweeper) – 33 ఉద్యోగాలు
విద్యార్హత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదోతరగతి పాసై ఉండాలి. లేదంటే ఆ మేరకు వేరే విద్యార్హత ఉన్నా కూడా సరిపోతుంది. మీరు అప్లై చేసుకునే ఉద్యానికి సంబంధిత ఫీల్డ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
ఐటీఐలో ఒకేషనల్ కోర్సు చేసిన వాళ్లు ఒక సంవత్సరం ఎక్స్‌పీరియన్స్‌తో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఐటీఐలో రెండేళ్ల డిప్లొమా చేసిన వాళ్లు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఫిజికల్ అర్హత:
పురుషులు ఎస్సీలు అయితే 162.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మిగతా కేటగిరివాళ్లు 167.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి.
మహిళలు ఎస్సీ కేటగిరికి చెందిన వాళ్లు అయితే 150 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి. మిగతా కేటగిరి కులస్తులైతే 157సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి.
చాతీ కొలతలు:
పురుషుల్లో ఎస్సీ కేటగిరి వ్యక్తులైతే 76-81 సెంటీమీటర్లు మిగతా కేటగిరిలు అయితే 78-83 సెంటీమీటర్లు ఉండాలి.
ఆసక్తి ఉన్న వాళ్లు BSF వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. పూర్తి ప్రక్రియను 28వ తేదీలోపు పూర్తి చేయాలి.
ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది. ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో ఎంపికైన వాళ్లను ఫిజికల్ టెస్టు నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయితే వాళ్లకు ఇంటర్వ్యూ పెడతారు.
ఎగ్జామ్ ఎప్పుడు అనేది ఇంతవరకు నోటీఫికేషన్‌లో ఎక్కడా చెప్పలేదు. ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులకు మెసేజ్ పంపిస్తారు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వంద రూపాయల ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. ఈ ఫీజును చలాన్‌రూపంలో, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా, ఆన్‌లైన్‌లో కూడా చెల్లించి వచ్చు.
అభ్యర్థుల వయసు 2021 ఆగస్టు నాటికి పద్దెనిమిదేళ్లు నిండి ఉండాలి. 23 ఏళ్లకు మించి ఉండకూడదు. అయితే కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం ఆయా కేటగిరీల వారికి వయసు సడలింపు ఉంటుంది.