(Source: ECI/ABP News/ABP Majha)
BEL: బెల్ బెంగళూరులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు
BEL Recruitment: బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.
BEL Recruitment: బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈ, బీటెక్, ఎంఏ, ఎంటెక్, పీహెచ్‌డీ, బీఎఫ్‌ఏ, బ్యాచిలర్ లైబ్రరీ లేదా మాస్టర్ లైబ్రరీ, ఎంసీఏ, బీకామ్, డిప్లొమా కలిగిన వారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 30
* టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు
⏩ నర్సరీ టీచర్: 01 పోస్టు
అర్హత: NTI/MTTతో ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.
⏩ ప్రైమరీ టీచర్: 02 పోస్టులు
⏩ మిడిల్ ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్(GPT): 05 పోస్టులు
⏩ హై స్కూల్-ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: 11 పోస్టులు
సబ్జెక్టులు: ఇంగ్లీష్, కన్నడ, హిందీ, సాన్‌స్ర్కిట్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్.
అర్హత: హైస్కూల్ టీచర్లకు ఎంఏ, ఎంఎస్సీ, ఎంసీఏ, బీఈడీ, ప్రైమరీ & మిడిల్ స్కూల్ టీచర్లకు బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీఈడీ కలిగి ఉండాలి.
⏩ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(లెక్చరర్): 03 పోస్టులు
సబ్జెక్టులు: ఫిజిక్స్- 01 పోస్టు, బయాలజీ- 02 పోస్టులు
అర్హత: మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ కలిగి ఉండాలి.
⏩ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(XI & XII స్టాండర్డ్ (CBSE కరికులం)): 03 పోస్టులు
సబ్జెక్టులు: ఫిజిక్స్- 01 పోస్టు, బయాలజీ- 01 పోస్టు, ఇంగ్లీష్- 01 పోస్టు
అర్హత: మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ కలిగి ఉండాలి.
⏩ ఎఫ్‌జీసీ(లెక్చరర్): 03 పోస్టులు
సబ్జెక్టులు: కంప్యూటర్ సైన్స్- 02 పోస్టులు, కన్నడ- 01 పోస్టు
అర్హత: మాస్టర్ డిగ్రీ (ఎంసీఏ, ఎంటెక్) (K-SET/నెట్‌కి ప్రాధాన్యత ఉంటుంది), ఎంఏ(K-SET/నెట్/పీహెచ్‌డీకి ప్రాధాన్యత ఉంటుంది).
⏩ కో-స్కాలస్టిక్ టీచర్: 04 పోస్టులు
సబ్జెక్టులు: డాన్స్(క్లాసికల్ డ్యాన్స్‌లో సీనియర్ & జూనియర్)- 02 పోస్టులు, మ్యూజిక్(క్లాసికల్ మ్యూజిక్‌లో సీనియర్ & జూనియర్)- 01 పోస్టు, ఫైన్ ఆర్ట్స్/డ్రాయింగ్- 01 పోస్టు, లైబ్రేరియన్- 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఏ, బీఎఫ్‌ఏ, బ్యాచిలర్ లైబ్రరీ లేదా మాస్టర్ లైబ్రరీ కలిగి ఉండాలి.
⏩ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, BEEi: 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్‌తో ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)తో పాటు పని అనుభవం ఉండాలి.
⏩ ఆఫీస్ అసిస్టెంట్: 03 పోస్టులు
అర్హత: బీకామ్, కంప్యూటర్ పరిజ్ఞానం లేదా డిప్లొమా (కమర్షియల్ ప్రాక్టీస్) కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. పోస్టు ద్వారా సంబంధిత చిరునామాలో దరఖాస్తులు పంపాలి.
జీతం:
➥ నర్సరీ ట్రైన్డ్ టీచర్(NTT)- రూ.18,700.
➥ ప్రైమరీ టీచర్ (PRT}- రూ.18,700.
➥ గ్రాడ్యుయేట్ ప్రైమరీ టీచర్ (GPT)- రూ.21,350.
➥ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- రూ.23, 100.
➥ సీబీఎస్‌ఈ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT))- రూ.24,200 + 10,000(సైన్స్ స్ట్రీమ్ కోసం ఇంటిగ్రేటెడ్ కోచింగ్ క్లాస్ CET, NEET)
➥ లెక్చరర్(PUC)- రూ.24,200+ 10,000(సైన్స్ స్ట్రీమ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ క్లాస్ CET, NEET)
➥ లెక్చరర్(FGC)- రూ.25,100.
➥ ఆఫీస్ అసిస్టెంట్- రూ.16,250.
చిరునామా:
SECRETARY, BEEi
BEL HIGH SCHOOL BUILDING
JALAHALLI P. 0
BENGALURU-560013.
దరఖాస్తుకు చివరి తేది: 23.04.2024.