News
News
వీడియోలు ఆటలు
X

సివిల్స్ పరీక్షల్లో ఇద్దరు అభ్యర్థులకు ఒకే ర్యాంక్- యూపీఎస్సీ ఏం చేస్తుందో?

మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులకు ఈ చిక్కు వచ్చి పడింది. దివాస్ జిల్లాకు చెందిన ఆయేషా ఫాతిమాకు 184వ ర్యాంక్ వచ్చింది. అలిరాజ్‌పూర్‌కు చెంజదిన ఆయేషా మక్రాణికి కూడా అదే ర్యాంకు చూపిస్తోంది.

FOLLOW US: 
Share:

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మమైన సివిల్స్‌ పరీక్షల్లో లక్షల మంది పోటీ పడుతుంటారు. వందల్లో విజయం సాధిస్తుంటారు. ఇందులో ర్యాంక్ వచ్చిందంటే చాలు ఫేట్ మారిపోయినట్టే. అలాంటి పరీక్షల్లో ఓ చిన్న పొరపాటు జరిగిన జీవితం తలకిందులైపోతుంది. 2022 సివిల్స్ పరీక్షల్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు అభ్యర్థులకు ఒకే ర్యాంకు వచ్చింది. ఇప్పుడు ఈ చిక్కు ముడిని అధికారులు ఎలా విప్పుతారో చూడాలి.  
 
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులకు ఈ చిక్కు వచ్చి పడింది. దివాస్ జిల్లాకు చెందిన ఆయేషా ఫాతిమాకు 184వ ర్యాంక్ వచ్చింది. అలిరాజ్‌పూర్‌కు చెంజదిన ఆయేషా మక్రాణికి కూడా అదే ర్యాంకు చూపిస్తోంది. ఇద్దరిలో ఆ ర్యాంకు ఎవరిదో మాత్రం క్లియర్‌ కావడం లేదు. ఈ ర్యాంకు తనదంటే తనది అంటూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. 

ఈ వివాదంపై ఇరు అభ్యర్థులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యూపీఎస్సీ బోర్డులో కూడా కంప్లైంట్ పెట్టారు. 184 ర్యాంకు వచ్చిందని ఎవరికి వాళ్లు సంతోష పడుతున్న టైంలో తన లాంటి ర్యాంకే వేరే వాళ్లకు ఉందని తెలిసి షాక్‌కి గురయ్యారు. అసలు తాము సంతోష పడాలో బాధ పడాలో తెలియని అయోమయంలో ఉన్నామని ఇరువురు అభ్యర్థులు చెబుతున్నారు. 

ఈ ఇద్దరి అభ్యర్థుల అడ్మిట్ కార్డులు పరిశీలిస్తే మాత్రం కొన్ని వ్యత్యాసాలు కనిపించినట్టు తెలుస్తోంది. ఫాతిమాకు పర్సనాలిటీ టెస్ట్‌ 2023 ఏప్రిల్‌ 25న జరిగింది. ఆ రోజు మంగళవారం రాసి ఉంది. మక్రాణి కార్డులో చూస్తే మాత్రం డేట్ అదే ఉంది కానీ వారం మాత్రం గురువారం చూపిస్తోంది. వాస్తవంగా క్యాలెండర్ చూస్తే మాత్రం ఏప్రిల్ 25 మంగవారం పడింది. ఫాతిమా కార్డుపై వాటర్‌మార్క్, క్యూఆర్ కోడ్‌ కూడా ఉంది. మక్రాణి కార్డు మాత్రం తెల్లకాగితంపై ప్రింట్ తీసింది స్పష్టంగా కనిపిస్తోంది. 

తప్పు ఎక్కడ జరిగిందో ఎంక్వయిరీ చేస్తున్నామని అంటున్నారు అధికారులు. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత అసలైన అభ్యర్థి ఎవరో తేల్చి వాళ్లకు 184 ర్యాంక్ కేటాయిస్తామంటున్నారు. 

తెలుగు తేజాల హవా..
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అదరగొట్టారు. వీరిలో జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకుతో మెరవగా.. శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, అనుగు శివమారుతీరెడ్డి 132వ ర్యాంకు, రాళ్లపల్లి వసంతకుమార్ 157వ ర్యాంకు, కమతం మహేశ్ కుమార్ 200వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217వ ర్యాంకు, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 270వ ర్యాంకు, చల్లా కల్యాణి 285వ ర్యాంకు, పాలువాయి విష్ణువర్దన్ రెడ్డి 292వ ర్యాంకు, గ్రంథె సాయికృష్ణ 293వ ర్యాంకు, వీరగంధం లక్ష్మి సుజిత 311వ ర్యాంకు, ఎన్. చేతనారెడ్డి 346వ ర్యాంకు, శృతి యారగట్టి 362వ ర్యాంకు, యప్పలపల్లి సుష్మిత 384వ ర్యాంకు, సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి 426వ ర్యాంకు, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.

టాపర్స్ వీళ్లే ..

1వ ర్యాంకు - ఇషితా కిశోర్
2వ ర్యాంకు -  గరిమా లోహియా
3వ ర్యాంకు - ఉమా హార్తి ఎన్
4వ ర్యాంకు - స్మృతి మిశ్రా
5వ ర్యాంకు - మయూర్ హజారికా
6వ ర్యాంకు - గెహ్నా నవ్య జేమ్స్
7వ ర్యాంకు - వసీం అహ్మద్ భట్
8వ ర్యాంకు - అనిరుధ్ యాదవ్
9వ ర్యాంకు - కనికా గోయల్
10వ ర్యాంకు - రాహుల్ శ్రీవాస్
11వ ర్యాంకు - పర్సంజీత్ కౌర్
12వ ర్యాంకు - అభినవ్ సివాచ్
13వ ర్యాంకు - విదుషి సింగ్ 
14వ ర్యాంకు - కృతికా గోయల్
15వ ర్యాంకు - స్వాతి శర్మ
16వ ర్యాంకు - శిశిర్ కుమార్ సింగ్
17వ ర్యాంకు - అవినాష్ కుమార్ 
18వ ర్యాంకు - సిద్ధార్థ్ శుక్లా
19వ ర్యాంకు - లఘిమా తివారీ
20వ ర్యాంకు - అనుష్క శర్మ
21వ ర్యాంకు - శివమ్ యాదవ్
22వ ర్యాంకు - జివి ఎస్ పవన్ దత్తా
23వ ర్యాంకు - వైశాలి
24వ ర్యాంకు - సందీప్ కుమార్
25వ ర్యాంకు - సంఖే కశ్మీరా కిషోర్
26వ ర్యాంకు - గుంజిత అగర్వాల్
27వ ర్యాంకు - యాదవ్ సూర్యభాన్ అచ్చెలాల్
28వ ర్యాంకు - అంకితా పువార్
29వ ర్యాంకు - పౌరుష్ సూద్
30వ ర్యాంకు - ప్రేక్ష అగర్వాల్
31వ ర్యాంకు - ప్రియాన్షా గార్గ్
32వ ర్యాంకు - నితిన్ సింగ్ 
33వ ర్యాంకు - తరుణ్ పట్నాయక్ మదాలా
34వ ర్యాంకు - అనుభవ్ సింగ్
35వ ర్యాంకు - అజ్మీరా సంకేత్ కుమార్
36వ ర్యాంకు - ఆర్య వీఎం
37వ ర్యాంకు - చైతన్య అవస్థి
38వ ర్యాంకు - అనూప్ దాస్
39వ ర్యాంకు - గరిమా నరులా
40వ ర్యాంకు - సాయి 

Also Read: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల, తిరుపతికి చెందిన పవన్ కు 22వ ర్యాంక్

Also Read: వంట కార్మికురాలి కొడుకు సివిల్స్‌లో 410వ ర్యాంకర్‌ - అదరగొట్టిన దళిత బిడ్డ

Published at : 25 May 2023 11:05 PM (IST) Tags: Madhya Pradesh Union Public Service Commission UPSC Candidates Ayasha Fatima Ayasha Makrani 184th Rank In Civil Services Exam

సంబంధిత కథనాలు

THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!

THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!

CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

CTET Exam Date: సీటెట్ (జులై) - 2023 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?