అన్వేషించండి

APPSC Junior Lecturers Notification: ఏపీలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పోస్టులెన్నంటే?

APPSC: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల (జేఎల్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు.

APPSC JL Notification: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల (జేఎల్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా ఆనర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు సంబంధిత వివరాలకు పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను జనవరి 31లోపు అందుబాటులో ఉంచనున్నారు.

వివరాలు..

* జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు

ఖాళీల సంఖ్య: 47

జోన్లవారీగా ఖాళీలు..

జోన్-1: 12, జోన్-2: 10, జోన్-3: 09, జోన్-4: 16.

సబ్జెక్టులవారీగా ఖాళీలు..

➥ ఇంగ్లిష్: 09 పోస్టులు  

➥ తెలుగు: 02 పోస్టులు

➥ ఉర్దూ: 02 పోస్టులు

➥ సంస్కృతం: 02 పోస్టులు

➥ ఒరియా: 01 పోస్టు 

➥ మ్యాథమెటిక్స్: 01 పోస్టు

➥ ఫిజిక్స్: 05 పోస్టులు

➥ కెమిస్ట్రీ: 03 పోస్టులు

➥ బోటనీ: 02 పోస్టులు

➥ జువాలజీ: 01 పోస్టు 

➥ ఎకనామిక్స్: 12 పోస్టులు

➥ సివిక్స్: 02 పోస్టులు

➥ హిస్టరీ: 05 పోస్టులు

అర్హత: ఎంఏ/ ఎంఎస్సీ/ఎంకామ్/బీఏ(ఆనర్స్)/ బీఎస్సీ(ఆనర్స్)/ బీకామ్ (ఆనర్స్) లేదా సంబంధిత రంగంలో ఏదైనా ఇతర సమానమైన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. సివిక్స్ సబ్జెక్టులు పొలిటికల్ సైన్స్ విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ(డిగ్రీ స్థాయి) - 150 ప్రశ్నలు- 150 మార్కులు- 150 నిమిషాలు; పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు (పీజీ స్థాయి) - 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కుకాగా.. పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.02.2024.

➥ రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే, 2024.

Notification

Website

ALSO READ:

➥ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 240 డీఎల్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ

➥  ఏపీలో 38 డీఈవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, జీతమెంతో తెలుసా?

➥ ఏపీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా

➥ ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Union Bank Of India Posts: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Embed widget