అన్వేషించండి

APPSC Group 1 Exam: వెబ్‌సైట్‌లో 'గ్రూప్-1' ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నమూనా పత్రాలు! అభ్యర్థులకు సూచనలివే!

APPSC 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రశ్నప్రతం బుక్‌లెట్, ఓఎంఆర్ పత్రాల నమూనా పత్రాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి. జనవరి 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అధాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షకు సంబంధించిన హాల‌టికెట్లను డిసెంబరు 31 నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. 

'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రశ్నప్రతం బుక్‌లెట్, ఓఎంఆర్ పత్రాల నమూనా పత్రాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పరీక్షపై అవగాహన కోసం ఈ నమూనా పత్రాలు ఉపయోగపడుతాయి. వాటిల్లో అభ్యర్థులు పరీక్షలో అనుసరించాల్సిన నిబంధనలను, ఇతర జాగ్రత్తలను క్షుణ్నంగా ఇచ్చారు. అభ్యర్థులు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.


APPSC Group 1 Exam: వెబ్‌సైట్‌లో 'గ్రూప్-1' ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నమూనా పత్రాలు! అభ్యర్థులకు సూచనలివే!

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

అభ్యర్థులు తమకు ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే, సూచించిన ప్రకారం అన్ని ప్రశ్నలు ఉన్నాయో లేదో చెక్ చేకోవాలి.   

➥ ప్రశ్నపత్రంలో మొత్తం 4 (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి, పార్ట్-డి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ'లో హిస్టరీ & కల్చర్, 'పార్ట్-బి'లో కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్, 'పార్ట్-సి'లో ఇండియన్ & ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్, 'పార్ట్-డి'లో జాగ్రఫీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగానికి 30 మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులు ఉంటాయి.  

తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.

➥ ఓంఎఆర్ షీటులో సమాధానాలను బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలు గుర్తించాలి (సర్కిల్ పూరించాలి). అనవసరపు  గుర్తులు పెట్టకూడదు. వైట్నర్ వాడకం నిషేధం.

సమాధాన పత్రం నింపడానికి కూడా బ్లూ/బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలి. జెల్ పెన్నులు, ఇంక్ పెన్నులు, పెన్సి్ల్స్ వాడకూడదు.

➥ సమాధాన పత్రం (ఓఎంఆర్ ఆన్సర్ షీటు)లో నిర్దేశించిన ప్రదేశంలో అభ్యర్థి సంతకంతోపాటు, ఇన్విజిలేటర్ సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలి. సంతకాలు లేని సమాధానపత్రాలు పరిగణనలోకి తీసుకోరు. 

ఓఎంఆర్ ఆన్సర్ షీటు మీద ఏదైనా రఫ్ వర్క్ గాని, గీతలు గీయడం గాని, చింపడం, పిన్ చేయడం లాంటివి చేయకూడదు.

➥ ఓఎంఆర్ షీటులో జవాబులు మార్చడానికి వైట్నర్, బ్లేడు, రబ్బరు లేదా ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేసినా సమాధానపత్రాలను పరిశీలించరు.  

ఇచ్చిన ప్రశ్నలకు బుక్‌లెట్‌లో జవాబులు గుర్తించకూడదు. ఓఎంఆర్ షీటులో మాత్రమే సమాధానాలు రాయాలి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు. 

➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, మ్యాథ్స్/లాగ్ టేబుల్స్, మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఆభరణాలు కూడా వేసుకురాకపోవడం మంచిది.

పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే అభ్యర్థులను బయటకు పంపుతారు. పరీక్ష మధ్యాలో ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు అనుమతించరు.

➥ పరీక్షలో కాపీ/చీటింగ్‌కు పాల్పడినట్లయితే పరీక్ష నుంచి బహిష్కరిస్తారు. 

రఫ్ వర్కును ప్రశ్నపత్రం చివరి పేజీలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.

➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్న కారణంగా జవాబులు జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాకి 0.3 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. 

పరీక్ష విధానం..

ప్రిలిమినరీ పరీక్ష: 
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.   ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు. 

* మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. 
* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు
* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు 
* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు 
* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే    

పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...

పోస్టులు పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

తెలంగాణలో 783 పోస్టుల‌తో గ్రూప్ – 2 నోటిఫికేష‌న్ విడుద‌ల‌, దరఖాస్తు ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం కానుక‌ను అందించింది. 783 పోస్టుల‌తో గ్రూప్ -2 నోటిఫికేష‌న్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. గ‌తంలో 1032 పోస్టుల‌ను గ్రూప్-2 కింద భ‌ర్తీ చేసిన సంగ‌తి తెలిసిందే.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget