అన్వేషించండి

APPSC Group2 Exam: 'గ్రూప్-2' ప్రిలిమ్స్ పరీక్షకు 87.17 శాతం అభ్యర్థలు హాజరు, ఫలితాలు ఎప్పుడంటే?

Group2 Prelims: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 4,04,037 అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాశారు.

APPSC Group2 Prelims: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో నకిలీ అడ్మిట్‌కార్డుతో ఒకరు పరీక్ష రాసేందుకు రాగా సిబ్బంది పట్టుకున్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను అయిదు నుంచి ఎనిమిది వారాల్లోగా వెల్లడిస్తామని, జూన్‌ లేదా జులైలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తామని గౌతం సవాంగ్ సూత్రప్రాయంగా వెల్లడించారు. వీలైతే మే నెలలోనే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు గౌతం సవాంగ్ ఫిబ్రవరి 25న విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించారు. పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. 

గ్రూప్-2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. పరీక్ష నిర్వహణకు 24 మంది అఖిల భారత సర్వీసుల అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1330 మంది లైజనింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. పరీక్ష కేంద్రాల్లో 24,142 మంది ఇన్విజిలేటర్లను, 8500 ఇతర సిబ్బందిని నియమించింది.

ఒకటి రెండు సంఘటనలు మినహా పరీక్ష ప్రశాంతం..
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి ఏపీపీఎస్సీ దృష్టికి వెళ్లిన ఓ సమాచారం గందరగోళాన్ని సృష్టించింది. పరీక్షకు నకిలీ అడ్మిట్‌కార్డుతో వచ్చిన ఒకరిని పట్టుకున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే నకిలీ అడ్మిట్‌కార్డుతో ఎవరూ పరీక్షకు హాజరు కాలేదని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఓ అభ్యర్థి తన పరీక్షా కేంద్రమైన.. నారాయణ కళాశాల, మర్రిమానువీధి చిరునామా ఎక్కడో చెప్పాలని ఫోన్ చేశారు. ఈ కేంద్రం చిత్తూరులో లేదని చెప్పాం. పరిశీలన కోసం వివరాల్ని ఏపీపీఎస్సీకి పంపించాం. వాళ్లు కూడా ఈ కేంద్రం చిత్తూరులో లేదని బదులిచ్చారని జిల్లా అధికారులు వివరణ ఇచ్చారు. సదరు అభ్యర్థి తిరుపతిలోని నారాయణ కళాశాలకు వెళ్లబోయి చిత్తూరుకు వచ్చారని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.

కటాఫ్ ఎంత ఉండొచ్చు..?
పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరి కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గ్రూప్-2 ప్రశ్నల తీరు ఇలా..

➥ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో పరీక్ష సమయం(2.30 గంటలు)కు తగినట్టుగా ప్రశ్నలు లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉండటంతో సమయం సరిపోక హైరానా పడ్డారు. ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఇచ్చారు. 

➥ ఇండియన్ సొసైటీ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబుల గుర్తింపునకు మరింత సమయం పట్టింది. ఈ పరిణామాలు గ్రామీణ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాయి. బ్లూప్రింట్, వెయిటేజ్‌కు తగ్గట్లు ప్రశ్నపత్రం లేదని, పోటీ స్ఫూర్తి అందులో కనిపించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. 

➥ వర్తమాన వ్యవహారాల్లో ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులు, విశాఖపట్నంలో జరిగిన మిలాన్-2024 గురించి ప్రశ్నలొచ్చాయి. మెంటల్ ఎబిలిటీలో విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, ఆడుదాం ఆంధ్రాలను ఉదహరిస్తూ ప్రశ్నలు అడిగారు. జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న జీవన క్రాంతి పథకం, వైఎస్‌ఆర్ నవోదయ పథకాలు, విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చిన అవార్డు గురించి ప్రశ్నలు ఇచ్చారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Embed widget