అన్వేషించండి

APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, ఆప్షన్ల నమోదుకు అవకాశం - ఈ తేదీల్లోనే ఇచ్చుకోవాలి

APPSC Group 2 Recruitment: గ్రూప్-2 అభ్యర్థులు పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలకు సంబంధించిన ఆప్షన్లు ఇచ్చుకోవాలని ఏపీపీఎస్సీ కోరింది. జూన్ 5 నుంచి 18 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపింది.

APPSC Group-2 Preferences: ఏపీపీఎస్సీ 'గ్రూప్-2' ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ అందించింది. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. ఆప్షన్లకు సంబంధించి పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలను (Post, Zonal, District Preferences) కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు జూన్ 5 నుంచి 18 వరకు ప్రాధ్యాన్యాలను ఇచ్చుకోవాలని కోరింది. అభ్యర్థులు గ్రూప్-2కు సంబంధించిన నోటిఫికేషన్‌ను క్షుణ్నంగా పరిశీలించి.. తమ ప్రాధాన్యాలను ముందుగానే ఒక పేపర్ పై  రాసి పెట్టుకుంటే, అప్‌లోడ్ చేసే సమయంలో సులువుగా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటలో తెలిపింది. 

APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్, ఆప్షన్ల నమోదుకు అవకాశం - ఈ తేదీల్లోనే ఇచ్చుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు.  

గ్రూప్-2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) ఫలితాలను ఏపీపీఎస్సీ ఏప్రిల్ 10న విడుదలచేసింది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులకు ఎంపికచేసింది. ప్రిలిమ్స్ ఫలితాల ద్వారా మొత్తం 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా.. 2,557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో తిరస్కరించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి తర్వాత దశలో జులై 8న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ గతేడాది  డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేశారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష కూడా ఆఫ్‌లైన్ మోడ్ (OMR) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 

గ్రూప్-2 మెయిన్ పరీక్ష విధానం..
మొత్తం 300 మార్కులకు గ్రూప్-2 మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఇందులో పేపర్-1 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, భారత రాజ్యాంగం నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్-2కు సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు (రెండున్నర గంటలు) కేటాయించారు.

APPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! రిజల్ట్ ఎప్పుడంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget