APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు, ఈ అర్హతలుండాలి
APFU Recruitment: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
APFU Recruitment: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంఎఫ్‌ఎస్సీ, ఐకార్- నెట్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 27న నిర్వహించే వాక్‌ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. జనవరి 27న ఉదయం 10 గంటల్లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.50,000 వేతనంగా చెల్లిస్తారు. నియామక పత్రాలు పొందిన తర్వాత నిర్ణీత గడువులోగా ఉద్యోగంలో చేరాలి. ప్రతిరోజూ తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. థియరీతోపాటు ప్రాక్టికల్ క్లాసులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు డాక్యుమెంట్ల వేరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, విద్యార్హతల ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి. 5 సెట్ల బయోడేటా, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను వెంట తీసుకెళ్లాలి. అన్ని సర్టిఫికేట్లు, డాక్యుమెంట్ల ఫోటోకాపీల సెట్ ఒకటి తీసుకెళ్లాలి. అభ్యర్థులకు ఎలాంటి TA/DA చెల్లించబడదు.
వివరాలు..
* గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 04
ఖాళీలున్న విద్యా సంస్థలు: సీఎప్‌ఎస్సీ, ముత్తుకూరు (నెల్లూరు జిల్లా); ఎఫ్‌ఆర్‌ఎస్, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా).
విభాగాలు..
1) ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ 01
అర్హత: ఎంఎఫ్‌ఎస్సీ (ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ ఫిషరీస్ రిసోర్సెస్ & మేనేజ్‌మెంట్/ఫిష్ బయోకెమిస్ట్రీ & సైకాలజీ), ఐసీఏఆర్- నెట్ లేదా సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
2) ఇన్‌స్ట్రక్షనల్ ఫ్రెష్‌వాటర్ ఫిష్ ఫాం(IFFF)- 02.
అర్హత: గుర్తింపు పొందిన SAU/CAU / ICAR ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో బీఎఫ్‌ఎస్సీ తర్వాత ఎంఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ ఆక్వా ఫార్మింగ్‌లో 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
3) ఇన్‌స్ట్రక్షనల్ బ్రాకిష్‌వాటర్ ఫిష్ ఫాం(IBWFF)- 01
అర్హత: గుర్తింపు పొందిన SAU/CAU / ICAR ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో బీఎఫ్‌ఎస్సీ తర్వాత ఎంఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ ఆక్వా ఫార్మింగ్‌లో 1-3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: ఒక్కో లెక్చర్‌కు రూ.1500 చొప్పున నెలకు రూ.50,000 వరకు చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 27.01.2024.
సమయం: ఉదయం 10.00 గంటల నుంచి.
ఇంటర్వ్యూ వేదిక:
APFU Camp Office, 5th Floor, Vishal Residency,
Opp. Siddhartha Engineering College, Padmaja Nagar
Tadigadapa,Vijyawada -521 134 .
Tel: 0866-3500560. e-mail: apfunsp@gmail.com
ALSO READ:
డా.వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫిభ్రవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..