AP Constable Results: ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలలో జాప్యం, రిజల్ట్స్‌పై అభ్యర్థులకు అలర్ట్
AP Police Constable Result direct link | ఎట్టకేలకు ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి హోంమంత్రి వంగలపూడి అనిత కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

AP Police Constable Result 2025 Out | అమరావతి: కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు (AP Constable Results) వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటలకి హోంమంత్రి అనిత ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా బుధవారానికి వాయిదా చేశారు. తుది జాబితాను బోర్డు మరోసారి పరిశీలించనున్న క్రమంలో కానిస్టేబుల్ ఫలితాల విడుదలను జులై 30కి వాయిదా వేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోనే హోంమంత్రి అనిత ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో 2022 అక్టోబర్‌లో జరిగిన కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు న్యాయ వివాదాల తర్వాత నేడు ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ కానిస్టేబుల్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.in లో చెక్ చేసుకోవాలని సూచించారు.
ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.
ఇటీవల జరిగిన కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 37,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 33,921 మంది అభ్యర్థులు అర్హత సాధించారు, 29,211 మంది పురుషులు, 4,710 మంది మహిళలు ఉత్తీర్ణులయ్యారు. OMR షీట్లు జూలై 12, 2025 వరకు డౌన్‌లోడ్ కు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో ఉంచారు.
ఈ ఫలితాలన్ని చెక్ చేయడానికి అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌లో AP పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ మీద లింక్‌ను క్లిక్ చేయాలి.
వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ అవ్వడానికి మీ రిజిస్ట్రేష్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. మీ స్క్రీన్‌పై రిజల్ట్ కనిపిస్తుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్/ డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితం చూసుకోవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకోవడం బెటర్ అని సూచించారు.
కానిస్టేబుల్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 6100
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
| జిల్లా | ఖాళీల సంఖ్య |
| శ్రీకాకుళం | 100 |
| విజయనగరం | 134 |
| విశాఖపట్నం (సిటీ) | 187 |
| విశాఖపట్నం (రూరల్) | 159 |
| తూర్పు గోదావరి | 298 |
| రాజమహేంద్రవరం (అర్బన్) | 83 |
| పశ్ఛిమ గోదావరి | 204 |
| కృష్ణా | 150 |
| విజయవాడ (సిటీ) | 250 |
| గుంటూరు (రూరల్) | 300 |
| గుంటూరు (అర్బన్) | 80 |
| ప్రకాశం | 205 |
| నెల్లూరు | 160 |
| కర్నూలు | 285 |
| వైఎస్సార్ - కడప | 325 |
| అనంతపురం | 310 |
| చిత్తూరు | 240 |
| తిరుపతి అర్బన్ | 110 |
| మొత్తం | 3580 |
2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (SCT) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..
| జిల్లా | ఖాళీల సంఖ్య |
| ఎచ్చెర్ల- శ్రీకాకుళం | 630 |
| రాజమహేంద్రవరం | 630 |
| మద్దిపాడు - ప్రకాశం | 630 |
| చిత్తూరు | 630 |
| మొత్తం | 2520 |
ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. అంతా ప్రక్రియ పూర్తి కావడం, న్యాయ వివాదాలు ముగియడంతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కానిస్టేబుల్ ఎగ్జామ్ తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.






















