అన్వేషించండి

AP RBK Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 7384 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

ప్రభుత్వంలోని శాఖల వారీగా ఖాళీగా ఉన్న 7384 పోస్టులను భర్తీ చేయనున్నారు 518 పశుసంవర్ధక సహాయక పోస్టులు, 1644 ఉద్యాన, 427 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు.

నిరుద్యోగులకు త్వరలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వంలోని శాఖల వారీగా ఖాళీగా ఉన్న 7384 పోస్టులను భర్తీ చేయనున్నారు 518 పశుసంవర్ధక సహాయక పోస్టులు, 1644 ఉద్యాన, 427 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేల్చారు. ఏపీలోని 660 మండలాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,347 మంది సేవలందిస్తున్నారు.

ఈ–క్రాప్, ఈ–కేవైసీ, పొలం బడులు, ఉద్యానవన, మత్స్య సాగు బడులు, పశువిజ్ఞాన బడుల నిర్వహణతో పాటు ఇతర రైతు ప్రాయోజిత కార్యక్రమాల అమలు కోసం ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీకేలకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలందించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వలంటీర్‌ను ఆర్బీకేలకు అనుసంధానించారు.

మరోవైపు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ సెంటర్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతోపాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకేలు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 

ఆర్బీకేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాంతిలోగా నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి తెలిపారు. ప్రతి ఆర్బీకేలో స్థానికంగా ఉండే పాడిపంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, వాటికనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు. 

Also Read:

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలను భర్తీ చేయటానిక అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి జనవరి 4న సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే జరిగిన నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని జగన్ అధికారులను ప్రశంసించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని, చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. 

అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో  అనుసంధానం చేయాలని, ప్రస్తుతం వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని, గ్రామంలోని ఆర్బీకేలు, విలేజ్‌ సెక్రటేరియట్స్‌లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.  అదేవిధంగా అంగన్‌వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget