అన్వేషించండి

APDSC Exams: ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలు వాయిదా, రివైజ్డ్ షెడ్యూలు ఎప్పుడంటే?

Andhra Pradesh డీఎస్సీ-2024 పరీక్షల నిర్వహణపై సందిగ్ధతకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల వల్ల పరీక్షలను వాయిదావేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన ద్వారా తెలిపింది.

AP DSC Exams Postponed: ఏపీలో డీఎస్సీ-2024 పరీక్షల నిర్వహణపై సందిగ్ధతకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదావేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన ద్వారా తెలిపింది. ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి స్పష్టత వచ్చాకే పరీక్షల కొత్త తేదీలను (రివైజ్డ్ షెడ్యూలు) ప్రకటించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు కొత్త షెడ్యూలు ప్రకారం అవకాశం కల్పించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అలాగే టెట్ ఫలితాలను కూడా తర్వాతే వెల్లడించే అవకాశం ఉంది.

"Candidates May Noted That The Revised Schedule will be Announced and option for centres will be enabled after clearance from Election Commission"

దేశవ్యాప్తంగా లోక్‌స‌భ‌ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. డీఎస్సీ పరీక్షలను ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశాలున్నాయి. డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని, డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నామని, ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. 

Website

ఏపీలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు డీఎస్సీ ప‌రీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను అభ్యర్థించారు. అయితే ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇది తమ ప‌రిధిలో ఉండ‌ద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమతిస్తే వాయిదా వేస్తామ‌ని అభ్యర్థులకు తెలిపింది. అయితే.. ఏపీ విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతలేదు.

ALSO READ:

TET 2024 Application: 'టెట్' దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)-2024 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ దరఖాస్తు ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది. ఈ విషయంలో అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనలేదు.
టెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget