(Source: ECI/ABP News/ABP Majha)
Local Jobs: పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే, సీఎం జగన్ కీలక ఆదేశాలు!
ప్రైవేటు సహా అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చేసిన చట్టాలను మరింత సమర్థంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రైవేటు సహా అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చేసిన చట్టాలను మరింత సమర్థంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటైన, నిర్మాణంలో ఉన్న, రాబోతున్న పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సూచించారు. చట్టం అమలవుతున్న తీరుపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని.. ప్రతి 6 నెలలకు ఓసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే సంస్థలు ఏవైనా.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం మంత్రివర్గ సమావేశం దృష్ట్యా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తీసుకొచ్చిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదముద్ర వేశారు.
ఎస్‌ఐపీబీ ఆమోదించినవి ఇవే..
➥ విశాఖ జిల్లా అన్నవరంలో మే ఫెయిర్ హోటళ్లు, రిసార్టులకు ఆమోదం.
➥విశాఖ జిల్లా అచ్యుతాపురంలో కోకాకోలా కంపెనీ ఏర్పాటుకు ఆమోదం.
➥ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు.
➥ వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు.
➥ వైఎస్సార్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో సోలార్ ప్రాజెక్టులకు ఆమోదం.
➥ తిరుపతి పేరూరులో హయత్ హోటల్ ఏర్పాటుకు ఆమోదం.
➥ తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో సీసీఎల్ ఫుడ్, బెవరేజెస్ కంపెనీ ఏర్పాటుకు ఆమోదం.
➥ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఎడిబుల్ ఆయిల్ తయారీ పరిశ్రమకు ఆమోదం.
➥ శ్రీసిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం.
ALSO READ:
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, వచ్చేనెలలో డీఎస్సీ నోటిఫికేషన్!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం (జులై 11) ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని మంత్రి స్పష్టంచేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వీఆర్ఏల సర్దుబాటుపై కేసీఆర్ కీలక ఆదేశాలు- జేపీఎస్ క్రమబద్దీకరణపై కమిటీలు ఏర్పాటు!
తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక భూముల సర్వే, రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఒకటి ధరణి పోర్టల్ తీసుకురావడం, మరో అంశం ఏంటంటే.. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. తమ ఉద్యోగాలు ఏమవుతాయోనని ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వారికి గుడ్ న్యూస్ చెప్పారు. నీటి పారుదల, ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వంలో 71 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, ఇతర అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జులై 8న ప్రారంభంకాగా.. జులై 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial