అన్వేషించండి

KCR Good News: వీఆర్ఏల సర్దుబాటుపై కేసీఆర్ కీలక ఆదేశాలు- జేపీఎస్ క్రమబద్దీకరణపై కమిటీలు ఏర్పాటు

KCR Review on JPS Regularization : ఇతర శాఖల్లో వీఆర్ఏలను  సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జేపీఎస్ లను రెగ్యూలరైజ్ చేయడంపై సైతం చర్చించారు.

Telangana CM KCR Review on JPS Regularization : తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చాక భూముల సర్వే, రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఒకటి ధరణి పోర్టల్ తీసుకురావడం, మరో అంశం ఏంటంటే.. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. తమ ఉద్యోగాలు ఏమవుతాయోనని ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వారికి గుడ్ న్యూస్ చెప్పారు. నీటి పారుదల, ఇతర శాఖల్లో వీఆర్ఏలను  సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.

వీఆర్​ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ప్రగతిభవన్​లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వీఆర్ఏ లను నీటి పారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పలు శాఖల అధికారులు వీఆర్ఏలతో చర్చించి అభిప్రాయాలు సేకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. మంత్రి కేటీఆర్​ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉపసంఘంలో మంత్రులు జగదీశ్​ రెడ్డి, సత్యవతి రాథోడ్​ సభ్యులుగా ఉంటారు. ఈ మంత్రుల ఉపసంఘం బుధవారం (జులై 12) నుంచే వీఆర్​ఏలతో చర్చలు జరపనుంది 

ఉప సంఘం సూచనల ప్రకారం అధికారులు వీఆర్ఏలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఆయా శాఖల్లో వీఆర్ఏల సేవలు ఉపయోగించుకోవాలని సీఎస్ శాంతికుమారిని సీఎస్ కేసీఆర్ ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక సమర్పించిన తరువాత మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాలని  అధికారులకు, ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సచివాలయంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలు పూర్తయ్యా. త్వరలోనే ఈ ప్రార్థనా స్థలాల ప్రారంభ తేదీలపై కూడా అధికారులతో కేసీఆర్​చర్చించినట్లు తెలుస్తోంది.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణపై చర్చలు..
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్)లు తమను పర్మినెంట్ చేయాలని గతంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై జేపీఎస్ లు సైతం కొన్ని నెలల కిందట 16 రోజుల పాటు సమ్మె చేపట్టారు. జేపీఎస్‌ల సమ్మెతో దిగివచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

జేపీఎస్‌ల పని తీరుపై జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, ఎస్పీ లేదా డీసీపీలు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. రాష్ట్ర స్థాయిలో కార్యదర్శి, లేదా శాఖాధిపతి స్థాయి అధికారి జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. జేపీఎస్‌ల పని తీరుపై జిల్లా కమిటీ పంపిన ప్రతిపాదనల్ని రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. రాష్ట్ర కమిటీ సీఎస్ శాంతికుమారికి నివేదిస్తారు. అన్ని పూర్తయ్యాక జేపీఎస్ ల రెగ్యులరైజేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, నిర్ణయం ప్రకటించిన సైరా బాను
Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం
Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్
RAPO 22: మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని... ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget