అన్వేషించండి

Postal GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

POSTAL RESULTS: పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను ఇండియా పోస్ట్ ఆగస్టు 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచింది.

India Post GDS Results: దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్ల పరిధిలో ఉన్న తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను అధికారులు ఆగస్టు 19న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఫలితాలకు సంబంధించి మొదటి జాబితాలో ఏపీ నుంచి 1356 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 980 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 1355 పోస్టులు ఉండగా, తెలంగాణ పరిధిలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 3లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. 

ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి జులై 12న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం జులై 15  నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు ఆగస్టు 6 నుంచి 8 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పదోతరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.

ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే..

➥ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ కాపీ 

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో 

➥ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు

➥ అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC) 

➥ కుల ధ్రువీకరణ పత్రం (కమ్యూనిటీ సర్టిఫికేట్) 

➥ఆధార్ కార్డు 

➥ ఆదాయ ధ్రువీకరణపత్రం (ఇన్‌కమ్ సర్టిఫికేట్)

➥ దివ్యాంగ ధ్రువీకరణ పత్రం (దివ్యాంగులైతే) 

➥ మెడికల్ సర్టిఫికెట్.

➥ ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లు, రెండు జతల జిరాక్స్ కాపీలు

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జవాన్ల త్యాగాలను కళ్లకు కట్టే బీఎస్‌ఎఫ్ మ్యూజియం, ఎక్కడుందంటే?Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
Ravi Basrurs: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Rohit Sharma: ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
Embed widget