అన్వేషించండి

APPSC: ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌‌టికెట్లు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. వీటిలో ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులకు,  ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ అండ్‌ ఫుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో శాంపిల్‌ టేకర్‌ పోస్టులకు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..

➥ ఆగస్టు 18న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

➥ ఆగస్టు 19 నుంచి 21 వరకు శాంపిల్‌ టేకర్‌ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు ఆగస్టు 18 వరకు అందుబాటులో ఉండనున్నాయి. టెక్నికల్ కారణాల వల్ల ఆగస్టు 18 నుంచి 20 వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ సేవలు నిలిచిపోతాయని, ఆలోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

➥ ఆగస్టు 21, 22 తేదీల్లో వివిధ ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌(ఏఈఈ) రాత పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఆగస్టు 21న మధ్యాహ్నం, 22న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఏఈఈ పరీక్ష నిర్వహించనున్నారు.

ALSO READ:

ఆగస్టు 29, 30 తేదీల్లో ఆ పాఠ‌శాలల‌కు సెల‌వులు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ప‌రీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే గ్రూప్-2 ప‌రీక్షల‌ు నిర్వహించనున్న పాఠ‌శాల‌ల‌కు ఆగస్టు 29, 30 తేదీల్లో సెల‌వులు ప్రక‌టిస్తూ పాఠ‌శాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చ‌ర్యలు తీసుకోవాల‌ని జిల్లా విద్యాధికారుల‌కు స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్టర్ శ్రీ దేవ‌సేన‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2 ప‌రీక్షల నిర్వహ‌ణ‌పై ఇప్పటికే జిల్లాల క‌లెక్టర్లు, ఎస్‌పీలు, ఇత‌ర అధికారుల‌తో టీఎస్‌పీఎస్సీ అధికారులు ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వహించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

షెడ్యూలు ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహణ, స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా గురించి వస్తున్న పుకార్లకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన  ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్)ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 585 పోస్టులు, మహిళలకు 65 పోస్టులు కేటాయించారు. ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget