AP Group 1 Jobs: నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్! ఏపీలో గ్రూప్-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏపీలో గ్రూప్ - 1, గ్రూప్ - 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 597 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఏపీలో గ్రూప్ - 1, గ్రూప్ - 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 597 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవోను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ నుంచి త్వరలోనే విడుదల కానున్నాయి. గ్రూప్ - 1లో 89 పోస్టులు, గ్రూప్ - 2లో 508 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గ్రూప్ - 1లో ఖాళీ పోస్టులు ఇవే
* డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో - ఆపరేటివ్ సొసైటీస్ - 05
* డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ - 01
* డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ - 04
* అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 02
* అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 06
* డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - కేటగిరీ - II - 25
* డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) - 01
* డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ - 01
* మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ - II - 01
* డిప్యూటీ కలెక్టర్ - 12
* డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ - 03
* అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ) - 18
* అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 01
* డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 03
* రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 06
మొత్తం - 89
గ్రూప్ - 2 లో ఖాళీ పోస్టుల వివరాలు
* ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 23
* జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 161
* న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 12
* లెజిస్లేచర్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రటేరియట్) - 10
* మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ - III - 04
* డిప్యూటీ తహసీల్దార్ (గ్రేడ్ - II) - 114
* సబ్ - రిజిస్ట్రార్ (గ్రేడ్ - II) - 16
* ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ - 150
* అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 18
మొత్తం - 508