అన్వేషించండి

AP DSC Merit List 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ 2025 మెరిట్ జాబితాపై కీలక ప్రకటన!

AP DSC Merit List 2025: ఆంధ్రప్రదేశ్‌లో మెరిట్‌ జాబితా ఒకట్రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఫైనల్ కరెక్షన్ అయిపోయింది. ఇంతలో నకిలీ సమాచారం స్ప్రెడ్ అవుతోంది.

AP DSC Merit List 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ 2025 స్కోర్ కార్డు విడుదల చేసి వారం రోజులు అవుతోంది. కరెక్షన్స్‌ కోసం ఇచ్చిన గడువు కూడా ముగిసింది. ఇప్పుడు ఫైనల్ మెరిట్ జాబితా ఎప్పుడు వస్తుందా అని చాలా ఉద్యోగులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పూర్తి స్థాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందని ఆశగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇదిగో పూర్తి జాబితా మార్కులు, అదిగో ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురి అవుతున్నారు.    

ఆగస్టు 15 రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... ఈ నెలాఖరుకు డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. అందుకే అభ్యర్థులు కూడా ఎప్పుడెప్పుడు జాబితా విడుదల చేస్తారా అని ఆత్రంగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఫేక్ ప్రచారం కంగారు పెట్టిస్తోంది. రకరకాల జాబితాలు వాట్సాప్ గ్రూప్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో డీఎస్సీ హెల్ప్‌లైన్‌కు వందల ఫోన్‌లు వస్తున్నాయి.

ఇలాంటి టైంలో డీఎస్సీకి సంబంధించిన అధికారులు కీలక ప్రకటన చేశారు. " మెగా DSC-2025 నియామక ప్రక్రియకు సంబంధించి కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ , నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు, తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వొచ్చింది . ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక, అనవసరమైన భయాందోళనలుగ కలిగిస్తున్నాయి. నియామక ప్రక్రియ పారదర్శకత దెబ్బతీయాలనే ఆలోచనతో, కావాలనే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉదేశ్యంతో చేస్తున్నట్లుగా అర్థమవుతోంది." అని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఏదైనా విషయం కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే తెలియజేస్తామని ప్రకటనలో తెలియజేశారు. "అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు మెగా DSC అధికారిక వెబ్సైటు, క్యాండిడేట్ లాగిన్‌లో పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేస్తాం. సోషల్ మీడియా, అనధికార వెబ్సైట్ ప్రచారమయ్యే ఎలాంటి సమాచారం నిజం కాదు"అని అన్నారు.  

నకిలీ సమాచారాన్ని ప్రసారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖాధికారులు హెచ్చరించారు. "ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించే వ్యక్తులపై చట్టాలకు అనుగుణంగా చట్ట పరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. అలాంటి వ్యక్తి  లేదా వ్యక్తులు నియామక ప్రక్రియను రద్దు చేస్తాం. ఇకపై ఎప్పుడూ కూడా వారు ఉద్యోగ పోటీ పరీక్షల్లో పాల్గొనకుండా చేస్తాం" అని అన్నారు. 

నకిలీ ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు అధికారులు సూచించారు. " అభ్యర్థులు, ప్రజలు ఇలాంటి వదంతులను, దుష్ప్రచారాలను నమ్మొద్దు. కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే నమ్మాలి" అని తెలియజేసింది. 

స్కోర్ కార్డులు విడుదల చేసిన అధికారులు టెట్‌ మార్కుల కరెక్షన్‌కు అవకాశం ఇచ్చారు. ఈ గడువు కూడా 15వ తేదీతో ముగిసింది. ఇప్పుడు వచ్చిన అభ్యర్థలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తి అవుతుందని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget