అన్వేషించండి

TSPSC: 'గ్రూప్‌-4' పరీక్షకు ఏర్పాట్లు పూర్తి, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

తెలంగాణలో  'గ్రూప్‌-4' రాతపరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 1న రాతపరీక్ష నిర్వహించనుంది. హాల్‌టికెట్లు ఈ వారాంతంలో అందుబాటులో ఉండనున్నాయి.

తెలంగాణలో  'గ్రూప్‌-4' రాతపరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 1న రాతపరీక్ష నిర్వహించనుంది. గ్రూప్‌-4 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ వారాంతంలో అందుబాటులో ఉంచనున్నారు. జులై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

మొత్తం 8,180 గ్రూప్‌-4 సర్వీసు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. 2018లో 700 వీఆర్‌వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 7.9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే ఈ లెక్కన ఒక్కోపోస్టుకు 116 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో ఒక్కో జిల్లాలో పోటీపడుతున్న అభ్యర్థుల సగటులో వ్యత్యాసం ఉండనుంది.

గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రాథమికంగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే డిసెంబరు 30న విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో మాత్రం 8039 పోస్టులనే భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తర్వాత ఈ పోస్టులకు అదనంగా 141 పోస్టులను జతచేయండంతో.. మొత్తం పోస్టులు సంఖ్య 8,180 కి చేరినట్లయింది.

పోస్టుల వివరాలు... 

మొత్తం ఖాళీల సంఖ్య: 8,180 పోస్టులు

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238.

2) జూనియర్ అసిస్టెంట్: 5730 పోస్టులు 

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-448 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-743 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-37 రెవెన్యూశాఖ-2,096
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-77
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. 

TSPSC: 'గ్రూప్‌-4' పరీక్షకు ఏర్పాట్లు పూర్తి, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

ALSO READ:

వెబ్‌సైట్‌లో ఏఎంవీఐ పరీక్ష హాల్‌టికెట్లు, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్ష హాల్‌టికెట్లను బుధవారం (జూన్ 21) టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏఎంవీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. హాల్‌టికెట్‌లో సూచించిన నిబంధనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించాలని కమిషన్ కోరింది. అభ్యర్థుల ప్రాక్టీసు కోసం వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్ లింకు అందుబాటులో ఉంది.
ఏఎంవీఐ హాల్‌టికెట్లు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Actress Hema in Bangluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ గురించి హేమ సంచలన వీడియో విడుదల | ABPTadipatri Tension |తాడిపత్రిలో ఈరోజు ఏం జరగనుంది..? | ABP DesamIranian President Ebrahim Raisi Dies | కూలిన హెలికాఫ్టర్..మృతి చెందిన ఇరాన్ అధ్యక్షుడు | ABP DesamChiranjeevi About Getup Srinu’s Raju Yadav Movie | రాజు యాదవ్ సినిమాపై చిరంజీవి రియాక్షన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి నివేదిక అందజేసిన సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
TS ECET - 2024 Results: తెలంగాణ ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
TS ECET - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, 95.86 శాతం ఉత్తీర్ణులు - ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Nellore News: కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Embed widget