ALIMCO: అలిమ్‌కో కాన్పూర్‌లో జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు
కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్‌కో) జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 09 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ALIMCO Jobs: కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్‌కో) జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 09
* జూనియర్ మేనేజర్ పోస్టులు.
అర్హత: డిగ్రీ, ఎంబీఏ, పీజీడీబీఎం ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: కనీసం 05 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు ఉండాలి.
పదవీకాలం: 03 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
జీతభత్యాలు: నెలకు రూ.60000 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 29.08.2023.
ALSO READ:
ఏకలవ్య గురుకులాల్లో 4,062 పోస్టులు, దరఖాస్తు గడువు పొడిగింపు - చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4,062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల గడువు జులై 31తో ముగిసింది. దీంతో ఆ గడువును ఆగస్టు 18 వరకు పొడిగిస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకు భర్తీకి అర్హులైన వారు ఆగస్టు 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్‌ఈఎస్‌టీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 323 టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ), నార్తర్న్ రైల్వే వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 323 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఎస్‌ఎస్ఎల్‌సీ, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో 105 ట్రాలీ రిట్రీవర్ పోస్టులు
చెన్నైలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(ఏఏఐ సీఎల్‌ఏఎస్) ట్రాలీ రిట్రీవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 02వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో 70 గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్‌పీఎల్) గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 55శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా,డిగ్రీ 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..