News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MRPL: మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో 70 గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు

మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్‌పీఎల్) గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

మంగళూరులోని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్‌పీఎల్) గ్రాడ్యుయేట్&టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 55శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా,డిగ్రీ 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

వివరాలు..

మొత్తం ఖాళీలు: 70

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ: 35

* టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీ: 35

విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ ప్రాక్టీస్.

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/డిగ్రీ 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: నిబంధనల మేరకు.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

శిక్షణ ప్రదేశం: మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

స్టైఫండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలకు రూ.10,000, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీలకు రూ.8000 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.08.2023.

Notification

Website

ALSO READ:

'టెట్‌' నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు మొదటివారంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా సెప్టెంబర్‌ మూడోవారంలో టెట్‌ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్ణయించింది. ఇటీవల సమావేశంలో టెట్‌ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.  ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు టెట్‌ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్‌ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్‌ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతర్గతంగా టెట్‌ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, హైదరాబాద్ యూనిట్‌లో ఖాళీలు ఎన్నంటే?
న్యూఢిల్లీలోని ప్రసార భారతీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా వీడియోగ్రాఫర్, సీనియర్ కరస్పాండెంట్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, కాపీ ఎడిటర్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, బులెటిన్ ఎడిటర్, బ్రాడ్‌క్యాస్ట్ ఎగ్జి్క్యూటివ్, అసైన్‌మెంట్ కోఆర్డినేటర్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-3), యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-2), వీడియో పోస్ట్ ప్రొడక్షన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.   పోస్టులవారీగా అర్హతలు, అనుభవం, వయోపరిమితి నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

'గ్రూప్‌-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్‌-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 01 Aug 2023 10:21 AM (IST) Tags: Mangalore Refinery and Petrochemicals Limited MRPL Notification MRPL Recruitment MRPL Graduate/Technician Apprentice Posts

ఇవి కూడా చూడండి

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

SSC JE Admit Card: ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ 'టైర్-1' హాల్‌టికెట్లు విడుదల, రీజియన్ల వారీగా అందుబాటులో

SSC JE Admit Card: ఎస్ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ 'టైర్-1' హాల్‌టికెట్లు విడుదల, రీజియన్ల వారీగా అందుబాటులో

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టులు

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టులు

Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!

Teachers Transfers: టీచర్ల బదిలీ షెడ్యూలు విడుదల, పదోన్నతులు లేనట్లే!

టాప్ స్టోరీస్

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

Gayatri Joshi: కార్ల పరేడ్‌లో ప్రమాదం, బాలీవుడ్‌ నటికి తీవ్ర గాయాలు - ఇద్దరి మృతితో విషాదం

Gayatri Joshi: కార్ల పరేడ్‌లో ప్రమాదం, బాలీవుడ్‌ నటికి తీవ్ర గాయాలు - ఇద్దరి మృతితో విషాదం