Prasar Bharati Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, హైదరాబాద్ యూనిట్‌లో ఖాళీలు ఎన్నంటే?
న్యూఢిల్లీలోని ప్రసార భారతీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఎంపికైనవారు హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీలోని ప్రసార భారతీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా వీడియోగ్రాఫర్, సీనియర్ కరస్పాండెంట్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, కాపీ ఎడిటర్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, బులెటిన్ ఎడిటర్, బ్రాడ్‌క్యాస్ట్ ఎగ్జి్క్యూటివ్, అసైన్‌మెంట్ కోఆర్డినేటర్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-3), యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-2), వీడియో పోస్ట్ ప్రొడక్షన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు, అనుభవం, వయోపరిమితి నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 23
1) వీడియోగ్రాఫర్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్‌తోపాటు డిగ్రీ/డిప్లొమా (సినిమాటోగ్రఫీ).
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 - రూ.40,000.
2) సీనియర్ కరస్పాండెంట్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ/పీజీ డిప్లొమా (జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్).
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000 - రూ.80,000.
3) ప్యాకేజింగ్ అసిస్టెంట్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు డిగ్రీ/పీజీ డిప్లొమా(జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) ఉండాలి.
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 - రూ.30,000.
4) కాపీ ఎడిటర్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు డిగ్రీ/పీజీ డిప్లొమా(జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) ఉండాలి.
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 - రూ.35,000.
5) కంటెంట్ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు డిగ్రీ/పీజీ డిప్లొమా(జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) ఉండాలి.
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 - రూ.35,000.
6) బులెటిన్ ఎడిటర్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటు డిగ్రీ/పీజీ డిప్లొమా(జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్) ఉండాలి.
అనుభవం: కనీసం 7 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 - రూ.50,000.
7) బ్రాడ్‌క్యాస్ట్ ఎగ్జిక్యూటివ్: : 03 పోస్టులు
అర్హత: డిగ్రీ/డిప్లొమా(రేడియో/టీవీ ప్రొడక్షన్) ఉండాలి.
అనుభవం: కనీసం 3 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 - రూ.40,000.
8) అసైన్‌మెంట్ కోఆర్డినేటర్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ/డిప్లొమా(జర్నలిజం) ఉండాలి.
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 - రూ.40,000.
9) యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-3): 02 పోస్టులు
అర్హత: డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ/డిప్లొమా(జర్నలిజం) ఉండాలి. కెమెరా ఫ్రెండ్లీ ముఖం కలిగి ఉండాలి. పదాలు స్పష్టంగా పలకగలగాలి. కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు ఉండాలి. ఇంటర్వ్యూ చేసే సామర్థ్యం ఉండాలి. సంబంధిత భాషపై మంచి పట్టు ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000 - రూ.40,000.
10) యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-2): 02 పోస్టులు
అర్హత: డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ/డిప్లొమా(జర్నలిజం) ఉండాలి. కెమెరా ఫ్రెండ్లీ ముఖం కలిగి ఉండాలి. పదాలు స్పష్టంగా పలకగలగాలి. కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు ఉండాలి. ఇంటర్వ్యూ చేసే సామర్థ్యం ఉండాలి. సంబంధిత భాషపై మంచి పట్టు ఉండాలి.
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.45,000 - రూ.60,000.
11) వీడియో పోస్ట్ ప్రొడక్షన్: 04 పోస్టులు
అర్హత: డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ/డిప్లొమా(జర్నలిజం) ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు.
వయోపరిమితి: 27.07.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 - రూ.40,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్షల లేదా ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 27.07.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.07.2023.
➥ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.07.2023.
పోస్టులవారీగా నోటిఫికేషన్లు ఇలా..
సీనియర్ కరస్పాండెంట్ నోటిఫికేషన్..
ప్యాకేజింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్..
కంటెంట్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్..
బ్రాడ్‌క్యాస్ట్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్..
అసైన్‌మెంట్ కోఆర్డినేటర్ నోటిఫికేషన్..
యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-3) నోటిఫికేషన్..
యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-2) నోటిఫికేషన్..